ETV Bharat / city

అటవీశాఖ సిబ్బంది పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఆరా​

author img

By

Published : Apr 22, 2021, 3:39 PM IST

indrakaran reddy
మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

ఎలాంటి అజాగ్రత్తలకు చోటివ్వకుండా కరోనా మార్గదర్శకాలను పాటించాలని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్షని స్పష్టం చేశారు. అటవీ శాఖ సిబ్బంది ఆరోగ్య స్థితిపై పీసీసీఎఫ్ శోభను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. ప్రస్తుతం స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. అటవీ శాఖలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తాజా పరిస్థితిపై ఆరా తీశారు. కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడంపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్​.శోభ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అజాగ్రత్తలకు చోటివ్వకుండా కరోనా నియమాలను పాటించాలని సూచించారు.

మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి సూచనల మేరకు అరణ్య భవన్​లో ప్రత్యేకంగా కొవిడ్​ వాక్సినేషన్ సెంటర్​ను ప్రారంభించినట్లు పీసీసీఎఫ్ వెల్లడించారు. ప్రతీ ఉద్యోగి వాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యారోగ్య శాఖ సమన్వయంతో.. అన్ని జిల్లాల్లో క్షేత్ర స్థాయి సిబ్బందికి వాక్సిన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

అరణ్య భవన్​లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్​ కేంద్రంలో టీకా పంపిణీని స్వయంగా పర్యవేక్షించారు. హైదరాబాద్ చీఫ్​ కన్జర్వేటర్​ ఎంజే అక్బర్, డీఎఫ్ఓ జోజి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇవీచూడండి: 'నేలతల్లి బాగుంటేనే.. భావితరాలకు మంచి భవిష్యత్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.