ETV Bharat / city

జూన్ 4న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

author img

By

Published : May 30, 2020, 3:31 PM IST

Updated : May 30, 2020, 4:52 PM IST

జూన్ 4న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం
జూన్ 4న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్​లోని జలసౌధలో జూన్​ 4న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ కానుంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చారు. రెండు రాష్ట్రాల ఫిర్యాదులు, ప్రాజెక్టులు, టెలిమెట్రీ ఏర్పాటు, జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే కొత్త నీటి సంవత్సరంలో జలాల వినియోగం సహా ఇతర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జూన్​ నాలుగో తేదీన సమావేశం కానుంది. కొత్త ఎత్తిపోతలను ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు 12వ సమావేశాన్ని జూన్ నాలుగో తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశ ఎజెండా అంశాలను పంపాలని రెండు రాష్ట్రాలను ఇప్పటికే బోర్డు కోరింది. ప్రాజెక్టుల డీపీఆర్​లు, టెలిమేట్రీ ఏర్పాటు, బోర్డు బడ్జెట్ సంబంధిత అంశాలపై చర్చించాలని బోర్డు ప్రతిపాదించింది.

లేఖలు అందలేదు..

అయితే రెండు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు బోర్డుకు లేఖలు అందలేదు. ఫలితంగా జూన్ నాలుగో తేదీన బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం రెండు రాష్ట్రాలకు సమాచారం పంపారు. ఎజెండాను తర్వాత చెప్తామని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా నదీ యజమాన్య బోర్డు ఇంఛార్జీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్​చీఫ్​లు, బోర్డు సభ్యులు పాల్గొంటారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా..

రెండు రాష్ట్రాల ఫిర్యాదులు, ప్రాజెక్టులు, టెలిమెట్రీ ఏర్పాటు, జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే కొత్త నీటి సంవత్సరంలో జలాల వినియోగం సహా ఇతర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ భావిస్తున్న నేపథ్యంలో బోర్డు సమావేశం కీలకంగా మారింది.

ఇవీ చూడండి: పత్తి దిగుబడి పెంచేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు

Last Updated :May 30, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.