ETV Bharat / state

పత్తి దిగుబడి పెంచేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు

author img

By

Published : May 30, 2020, 4:43 PM IST

పత్తి సగటు దిగుబడిపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలో సగటున ఎకరానికి 2.20 క్వింటాళ్ల వరకు వస్తున్న తరుణంలో... నూనె శాతం అధికంగా ఉండే విత్తనాలు అవసరమని విత్తన కంపెనీలు భావిస్తున్నాయి. అందుకోసం కొత్త వంగడాలు ప్రోత్సహించాలన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు జాతీయ విత్తన కంపెనీల సంఘం... భారత వ్యవసాయ పరిశోధన మండలి - ఐసీఏఆర్‌కు లేఖ రాసింది.

cotton yeilds average
పత్తి దిగుబడి పెంచేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు

దేశంలో పత్తి జాతీయ సగటు దిగుబడి పదేళ్లుగా ఎకరం విస్తీర్ణంలో 2.20 క్వింటాళ్ల వరకే ఉంటోంది. జన్యు మార్పిడి - జీఎం పత్తి విత్తనాలు తొలుత మార్కెట్‌లోకి వచ్చినప్పుడు పచ్చపురుగును తట్టుకున్నా ఆ తర్వాత చిన్నపాటి తెగుళ్లును కూడా తట్టుకోలేనందున సాగు వ్యయం బాగా పెరిగింది. ఇలాగే కొనసాగితే దేశంలో పత్తి సగటు దిగుబడి ఎకరానికి మరో 40 కిలోలకు మించి పెరగదు. ఎకరానికి సగటు దిగుబడి 3 క్వింటాళ్లకు పెంచాలంటే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక కార్యక్రమం అమలుకు వెంటనే జాతీయ వ్యూహం రూపొందించుకోవాలని జాతీయ విత్తన కంపెనీల సంఘం భారత వ్యవసాయ పరిశోధన మండలి - ఐసీఏఆర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసింది.

ఎకరాకి 24 వేల మొక్కలు నాటేలా చూడాలి..

ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో పత్తి కోత పనుల్లో యంత్రాల వినియోగం బాగా పెరిగింది. ఫలితంగా నాణ్యమైన దూది వస్తుంది. భారత్‌లో ఇంకా మనుషులే పత్తి చేలలో దూది తీస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యాలు కాలుష్యం బారినపడుతున్నాయి. భవిష్యత్తులో కూలీల కొతర కూడా సమస్యగా మారనుండటం ఆందోళన కలిగిస్తోంది. 150 రోజుల్లో కోతకు వచ్చే నాణ్యమైన పత్తి కొత్త వండగాలను అభివృద్ధి చేయాలి. యంత్రాలు క్షేత్రంలో తిరిగేలా... ఎకరానికి 24 వేల మొక్కలు నాటేలా సాగు పద్ధతులు మారాలి. పత్తికి మద్ధతు ధర పెంచుతూపోవడం ఎంతోకాలం సాగదు. ఎందుకంటే దేశంలో పండే పత్తి ధర 2019 నుంచి ప్రపంచ మార్కెట్‌ ధర కన్నా ఎక్కువగా ఉంటోంది. గతంలో ఇలా ఎక్కువగా ఉండేది కాదు.

మద్ధతు ధర పెంచొద్దు... సాగు వ్యయం తగ్గించాలి

మద్ధతు ధర ఇంకా పెంచితే దేశంలో పత్తి నిల్వలు పెరుగుతాయి. పత్తి సాగు వ్యయం తగ్గించడం ద్వారానే ఈ పంటపై రైతులకు లాభాలు వస్తాయి. గులాబీ పురుగును తట్టుకునేందుకు పత్తి సాగులో మార్పులు తేవాలి. కలుపు మొక్కలును చంపే రసాయనాలను తట్టుకునే బీటీ పత్తి విత్తనాలను వాడితే... కలుపు ఖర్చలు తగ్గుతాయి. ఇప్పటికే వీటిని అక్రమంగా సాగు చేస్తున్నారు. అనుమతిస్తే ఈ సమస్యలు తప్పుతాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలు సేంద్రీయ పద్ధతుల్లోనే పత్తి సాగును ప్రోత్సహించాలి. పత్తి సాగు తర్వాత పప్పు ధాన్యాలు, నూనెగింజల పంటలను పండించే విధంగా ప్రోత్సహించాలని విత్తన కంపెనీలు సూచించాయి. దూది పింజ పొడవు పెంచేలా దేశంలో స్పిన్నింగ్ మిల్లుల సామర్థ్యం ఆధునికీకరించాలని ఆ లేఖలో పేర్కొన్నాయి.

బీటీ పత్తి విత్తనాలకు అనుమతివ్వాలి..

ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక వాతావరణ మార్పుల నేపథ్యంలో... ప్రత్యేకించి భారతదేశంలో కరవు కాటకాలు, తుపాన్లు, అధిక వర్షాలు, వరదలు, కార్బన్‌ డయాక్సైడ్‌ వంటి వాటిని తట్టుకుని అధిగ దిగుబడి ఇచ్చే వండగాలను అభివృద్ధి చేయాలి. నూనె శాతం అధికంగా ఉంటే సంకరజాతి పత్తి వంగడాలను అభివృద్ధి చేస్తే పంట నూనెల ఉత్పత్తి పెరుగుతుంది. విత్తన కంపెనీలు కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన బీటీ పత్తి విత్తనాలకు అనుమతి ఇవ్వడంలో జాప్యం నివారించాలని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.