ETV Bharat / city

Kothapet Fruit Market: ఈ నెల 25 రాత్రి నుంచి పండ్ల మార్కెట్‌ మూసివేత

author img

By

Published : Sep 23, 2021, 8:12 PM IST

Updated : Sep 24, 2021, 12:30 AM IST

kothapet-fruit-market-closing-from-september-25th
kothapet-fruit-market-closing-from-september-25th

హైదరాబాద్​లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్​ మూతపడనుంది. ఈ నెల 25 నుంచి మూసేయనున్న పండ్ల మార్కెట్​ను.. అక్టోబర్​ 1 నుంచి బాటసింగారంలోని లాజిస్టిక్​ పార్క్​లో ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ శివారు కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్​లో క్రయవిక్రయాలు ఈ నెల 25 నుంచి బంద్​ కానున్నాయి. అక్టోబర్​ 1 నుంచి బాటసింగారంలోని లాజిస్టిక్​ పార్క్​లో పండ్ల మార్కెట్​ లావాదేవీలు ప్రారంభిస్తున్నట్లు.. మార్కెట్ కమిటీ ఇంఛార్జి ఛైర్మన్​ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడున్న 22 ఎకరాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కానుందన్నారు. ఈనెల 30న ఈ ప్రాంతాన్ని మెడికల్​ అండ్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​కు అప్పగిస్తామన్నారు.

రంగారెడ్డి జిల్లా కోహెడలోని 178 ఎకరాల్లో పండ్ల మార్కెట్​ను శాశ్వత ప్రాతిపదికన నిర్మాణానికి డీపీఆర్​ ఇచ్చినట్లు తెలిపారు. అక్కడ మార్కెట్​ నిర్మాణానికి సమయం పట్టే అవకాశం ఉండడం వల్ల తాత్కాలిక ప్రాతిపదికన బాటసింగారం లాజిస్టిక్​ పార్క్​కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, ఏజెంట్లు, హమాళీలు గుర్తించి, సహకరించాలని కోరారు.

మార్కెట్లో ఉన్న 341 మంది కమీషన్​ ఏజెంట్లకు కావల్సిన సదుపాయాలను లాజిస్టిక్ పార్కులో కల్పించినట్లు మార్కెట్​ కమిటీ ఇంఛార్జి ఛైర్మన్​ ముత్యంరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: KTR: 'రూ.3,866 కోట్లతో హైదరాబాద్‌లో మురుగునీరు శుద్ధి ప్లాంట్‌'

Last Updated :Sep 24, 2021, 12:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.