ETV Bharat / city

బడంగ్​పేట్​లో రెండు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం

author img

By

Published : May 18, 2022, 9:49 PM IST

రంగారెడ్డి జిల్లా బడంగ్​పేట్​ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆ కార్పొరేషన్ మేయర్ పారిజాతరెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈఎస్​ఐసీ ఉచిత వైద్య అవగాహన సదస్సును ఆమె ప్రారంభించారు.

HEALTH CAMP
HEALTH CAMP

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈఎస్ఐసీ ఉచిత వైద్య అవగాహన సదస్సును మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. అన్ని వ‌ర్గాల ప్రజ‌ల‌కు వైద్యసేవలు చేరువయ్యేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయని ఆమె అన్నారు.

ఉచిత వైద్య శిబిరంలో భాగంగా 300 మంది మున్సిపల్ సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని మేయర్ పారిజాత నర్సింహారెడ్డి తెలిపారు. చిన్నవయసులోనే నేడు అనేక వ్యాధులకు గురవుతున్నారని... మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలినే అందుకు కారణమని ఆమె అన్నారు. అందుచేత పారిశుద్ధ్య కార్మికులు, వారి కుటుంబసభ్యులందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్లు, వైద్యులు, తెరాస పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Summer Camp At Shilparamam: శిల్పారామంలో ఆకట్టుకుంటున్న సమ్మర్‌ క్యాంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.