ETV Bharat / city

GRMB Meeting : రేపు గోదావరి బోర్డు సమావేశం

author img

By

Published : Apr 26, 2022, 12:47 PM IST

GRMB Meeting : గోదావరి యాజమాన్య బోర్డు ఈనెల 27న మరోసారి సమావేశం కానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా.. మూడో మారు ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల అధికారులకు బోర్డు సమాచారం అందించింది.

GRMB Meeting
GRMB Meeting

GRMB Meeting : గోదావరి నదీ యాజమాన్య బోర్డు రేపు మరోమారు సమావేశం కానుంది. ఇప్పటికే రెండు మార్లు జీఆర్ఎంబీ సమావేశం వాయిదా పడగా... తాజాగా మూడోమారు భేటీ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సభ్యులు రాకపోవడంతో సమావేశాన్ని మార్చి 11, ఏప్రిల్ 22 తేదీల్లో ఛైర్మన్ ఎంపీసింగ్ వాయిదా వేశారు. త్వరలోనే మరోమారు సమావేశం నిర్వహిస్తామని అప్పుడు ఛైర్మన్ ప్రకటించారు. అదే సమావేశాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు గోదావరి బోర్డు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.

GRMB Meeting in Hyderabad: హైదరాబాద్ జలసౌధ వేదికగా రేపు సమావేశం జరగనుంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్‌లపై భేటీలో చర్చిస్తారు. తెలంగాణకు చెందిన చనాకా - కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్ హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్‌లపై సమావేశంలో చర్చ జరగనుంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.