ETV Bharat / city

ఐదో రోజు రైతుల ఖాతాల్లో రూ.36.29 కోట్ల జమ

author img

By

Published : Aug 21, 2021, 7:22 PM IST

తెలంగాణలో రూ.50 వేల లోపు రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగుతోంది. 5వ రోజు రుణమాఫీ కింద 12,280 మంది రైతులకు 36.29 కోట్ల రూపాయల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 63,074 మంది రైతుల ఖాతాల్లో 172.86 కోట్ల రూపాయలు జమ అయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి చెప్పారు.

Loan Waiver
రైతు రుణమాఫీ

రాష్ట్రంలో రుణమాఫీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇవాళ 36.29 కోట్ల రూపాయల రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. 5వ రోజు రుణమాఫీ కింద 12,280 మంది రైతులకు లబ్ధి చేరిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 63,074 మంది రైతుల ఖాతాల్లో 172.86 కోట్ల రూపాయలు జమ అయ్యాయని చెప్పారు. శుక్రవారం రుణమాఫీ పథకం కింద 10,958 మంది రైతుల ఖాతాలకు రూ.39.40 కోట్ల నిధులు బదిలీ చేశామన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాల అమలుతోపాటు వ్యవసాయ పంటల ఉత్పత్తులు కొనుగోళ్లు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇన్ని వ్యవసాయ అనుకూల నిర్ణయాలు లేవని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల అమలు ద్వారా వ్యవసాయం చేసే రైతన్నలకు ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నారు. వ్యవసాయం లాభసాటి పరిశ్రమగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Revanth Reddy: 'వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ ఇక్కడి నుంచే వచ్చారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.