Top Ten News: టాప్​ న్యూస్​ @5PM

author img

By

Published : May 12, 2022, 4:59 PM IST

Top Ten News: టాప్​ న్యూస్​ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • బండిసంజయ్​కు కేటీఆర్​ స్వీట్​ వార్నింగ్​..

KTR warning to Bandi sanjay: భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ను మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ వేదికగా హెచ్చరించారు. అసత్య ఆరోపణలు చేస్తే చట్టరిత్యా చర్యలు తీసుకోవాల్సివస్తుందని తెలిపారు. దీంతో పాటు.. చనిపోయిన ఓ భాజపా కార్యకర్త భార్య తనకు తెరాస ప్రభుత్వం చేసిన సాయం గురించి బండి సంజయ్​కు వివరిస్తోన్న వీడియోను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

  • 'రోగి సహాయకులకు 3 పూటలా భోజనం'

meals at Rs.5 for patient's attendant: హరేరామ హరేకృష్ణ... పేదల కోసం నిస్వార్థంగా పనిచేసే సంస్థ అంటూ మంత్రి హరీశ్​రావు ప్రశంసించారు. 18 ప్రభుత్వాసుపత్రుల్లో హరే కృష్ణా మూమెంట్ ఛారిటబుల్‌ ట్రస్ట్‌తో కలిసి ప్రభుత్వాసుపత్రుల్లో రోగి సహాయకులకు భోజన వసతి కల్పించే కార్యక్రమాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో మంత్రి ప్రారంభించారు. త్వరలోనే అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో నైట్‌ షెల్టర్లు రాబోతున్నాయని ఆయన ప్రకటించారు.

  • మంత్రి అంబటిపై అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్‌

ఆంధ్రప్రదేశ్​ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్‌ చేశారు. రాంబాబును 'కాంబాబు' అంటూ ట్విట్టర్​లో రాసుకొచ్చారు. ఓ యూట్యూబ్​ ఛానల్​ యాంకర్​ను లైంగికంగా వేధించిన వ్యవహారంలో 'కాంబాబు' బర్తరఫ్​ ఖాయం అంటూ పోస్టు పెట్టారు.

  • 'నేను డబ్బు తీయలేదు'.. క్యాషియర్​ ప్రవీణ్​ సెల్ఫీ వీడియో

Bank Of Baroda Cashier Case: హైదరాబాద్‌ వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం ఘటన కొత్త మలుపు తిరిగింది. సాహెబ్‌నగర్‌ బ్రాంచీలో క్యాషియర్‌ రూ. 22.53 లక్షల నగదుతో పరారైనట్లు... బ్యాంకు అధికారులు మంగళవారం.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై సెల్ఫీ వీడియో ద్వారా క్యాషియర్‌ ప్రవీణ్‌ వివరణ ఇచ్చాడు.

  • కాంగ్రెస్ 'చింత' తీరేనా?

సంక్షుభిత కాంగ్రెస్.. ఆత్మవిమర్శకు సిద్ధమైంది. పరిస్థితులను బేరీజు వేసుకునేందుకు చింతన్ శిబిర్ పేరిట శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానుంది. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్​కు.. ఈ సమావేశాల్లో పరిష్కారాలు లభిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.

  • 'తాజ్​మహల్​లో హిందూ దేవతా విగ్రహాలు' పిటిషన్ కొట్టివేత

Taj Mahal 22 rooms case: తాజ్​మహల్​లోని 22 గదుల్లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్​ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. గదులను తెరిచేలా పురావస్తు శాఖ అధికారులను ఆదేశించాలని దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

  • ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకేఒక్కడు.. ఇకపై శ్రీలంకకు ప్రధాని!

Sri Lanka New Prime Minister: శ్రీలంకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ కొత్త ప్రధానిని నియమించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు గోటబయా రాజపక్స. తదుపరి ప్రధాన మంత్రిగా మాజీ పీఎం రణిల్​ విక్రమసింఘె ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం 6.30 గంటలకు ప్రధానిగా విక్రమసింఘె బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని యూఎన్​పీ సీనియర్​ నేతలు వెల్లడించారు.

  • మార్కెట్లకు భారీ నష్టాలు

స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్​లో భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,158 పాయింట్లు పతనమై 52,930 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 359 పాయింట్లు క్షీణించి 15,808 వద్ద ముగిసింది.

  • గూగుల్​ సెర్చ్ రిజల్ట్స్​లో మీ పర్సనల్ ఇన్ఫో ఉందా? డిలీట్ చేయండిలా...

Google new tool: సెర్చ్ రిజల్ట్స్​లో వ్యక్తిగత సమాచారం కనిపిస్తే దాన్ని సులభంగా తొలగించేందుకు కొత్త టూల్​ను అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్​ వెల్లడించింది. ప్రత్యేకించి గూగుల్​ యాప్​లో దీన్ని తీసుకురానున్నట్లు తెలిపింది.

  • 'మహేశ్​బాబు​ మాటలు నాకు అర్థం కాలేదు'

బాలీవుడ్​పై మహేశ్​బాబు చేసిన వ్యాఖ్యలు బీటౌన్​లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంపై తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​వర్మ స్పందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.