18 ప్రభుత్వాసుపత్రుల్లో రోగి సహాయకులకు 3 పూటలా భోజనం: మంత్రి హరీశ్​

author img

By

Published : May 12, 2022, 3:47 PM IST

Updated : May 12, 2022, 4:19 PM IST

18 ప్రభుత్వాసుపత్రుల్లో రోగి సహాయకులకు 3 పూటలా భోజనం: మంత్రి హరీశ్​

meals at Rs.5 for patient's attendant: హరేరామ హరేకృష్ణ... పేదల కోసం నిస్వార్థంగా పనిచేసే సంస్థ అంటూ మంత్రి హరీశ్​రావు ప్రశంసించారు. 18 ప్రభుత్వాసుపత్రుల్లో హరే కృష్ణా మూమెంట్ ఛారిటబుల్‌ ట్రస్ట్‌తో కలిసి ప్రభుత్వాసుపత్రుల్లో రోగి సహాయకులకు భోజన వసతి కల్పించే కార్యక్రమాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో మంత్రి ప్రారంభించారు. త్వరలోనే అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో నైట్‌ షెల్టర్లు రాబోతున్నాయని ఆయన ప్రకటించారు.

meals at Rs.5 for patient's attendant: జీహెచ్​ఎంసీ పరిధిలోని పలు ప్రభుత్వాసుపత్రుల్లో రోగి సహాయకులకు భోజన వసతి ప్రారంభమైంది. 18 ప్రభుత్వాసుపత్రుల్లో హరే కృష్ణా మూమెంట్ ఛారిటబుల్‌ ట్రస్ట్‌తో కలిసి ఆహార వసతి కల్పిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోగి సహాయకులకు రోజూ మూడు పూటలా 5రూపాయలకే భోజన వసతి లభించనుంది. కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్​.. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని వెల్లడించారు. హరేరామ హరేకృష్ణ... పేదల కోసం నిస్వార్థంగా పనిచేసే సంస్థ అంటూ మంత్రి ప్రశంసించారు. వృద్ధులు, వితంతువులు ఆత్మగౌరవంతో బతకాలని పింఛన్‌ పెంచామని మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో నైట్‌ షెల్టర్లు రాబోతున్నాయని ఆయన ప్రకటించారు.

పేదల ఆకలి తీర్చేందుకు మనిషికి 6 కేజీల చొప్పున ఇంట్లో ఉన్న అందరికి భోజనం అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​దేనని ఆయన అన్నారు. నాణ్యత గల భోజనం అందించడమే సీఎం లక్ష్యమన్నారు. మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు తిన్నంత ఆహారం ఇస్తున్న సర్కార్ తెలంగాణలోనే ఉందన్నారు. ఒక్కో నెల రోగి సహాయకుల కోసం 40 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని మంత్రి హరీశ్​ వెల్లడించారు. రోజుకి కనీసం 20 వేల మంది లబ్ధి పొందుతారని ఆయన అంచనా వేశారు. ప్రతి భోజనంపై ప్రభుత్వం హరే రామ హరే కృష్ణ సంస్థ వారికి 21 రూపాయల సబ్సిడీ ఇస్తోందని మంత్రి తెలిపారు.

"నైట్ షెల్టర్లను వీలైనంత త్వరగా అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకొస్తాం. రోగుల డైట్ ఛార్జీలను పెంచుతున్నాం. డైట్ ఛార్జీ 56 ఉండగా.. 112 చేసాము. దీనితో 43 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడనుంది. డైట్ కోసం కొత్త టెండర్లను పిలుస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ కోసం 338 కోట్లు బడ్జెట్​లో కేటాయించాం. అన్ని ఆసుపత్రుల్లో సీవరేజ్ ట్రీట్​మెంట్​ ప్లాంట్​లు తీసుకురానున్నాం. రూ. 2679 కోట్లతో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు శంకుస్థాపన చేశాం. టిమ్స్ 1000, నిమ్స్​లో 2000 పడకలకు ప్రభుత్వం త్వరలో అనుమతులు జారీ చేయనుంది. కొత్త ఆస్పత్రుల్లో ముందే అటెండెంట్ షెల్టర్ హోమ్​ల నిర్మాణం, స్టాఫ్ క్వార్టర్స్ సిద్ధం చేస్తాం. అల్వాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎంసీహెచ్ ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయనున్నాం. అవయవ మార్పిడులు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్నాం. ఫైర్ సేఫ్టీ కోసం భారీగా నిధులు కేటాయించాం." - హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి​

ఉస్మానియా ఆసుపత్రికి ఇటీవల 75 ఐసీయూ పడకలను మంజూరు చేయగా.. ఇవాళ 40 పడకలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి హరీశ్​ రావు వెల్లడించారు. రూ.30 కోట్ల పనులను ఇవాళ ఉస్మానియాలో ప్రారంభించినట్లు తెలిపారు. ఉస్మానియా మార్చురీని అత్యాధునికంగా తీర్చిదిద్దేదుకు 6 కోట్లు కేటాయించామన్నారు. ఆర్థోపెడిక్ కాంప్లెక్స్​ నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. ఎన్​ఏబీహెచ్ కింద ఉస్మానియాకు మరో 10 కోట్ల రూపాయల కేటాయించినట్లు మంత్రి హరీశ్​ స్పష్టం చేశారు. హెరిటేజ్ ఇబ్బందులు లేకుండా ఉస్మానియాలో కొత్త బ్లాక్ నిర్మాణానికి ఏర్పాట్లు చేపట్టామన్నారు. కమిటీ రిపోర్ట్ రాగానే సీఎం దృష్టికి తీసుకువెళ్లి కొత్త బ్లాక్ ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

18 ప్రభుత్వాసుపత్రుల్లో రోగి సహాయకులకు 3 పూటలా భోజనం

ఇవీ చదవండి:

Last Updated :May 12, 2022, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.