మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 1158 పాయింట్లు డౌన్

author img

By

Published : May 12, 2022, 9:29 AM IST

Updated : May 12, 2022, 4:36 PM IST

stock-market-live-updates

15:41 May 12

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్​లో భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,158 పాయింట్లు పతనమై 52,930 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 359 పాయింట్లు క్షీణించి 15,808 వద్ద ముగిసింది. ఆటో, బ్యాంక్​, మెటల్​, ఆయిల్​ అండ్​ గ్యాస్​, పవర్​, క్యాపిటల్​ గూడ్స్​, ఫార్మా, ఎఫ్​ఎంసీజీ సహా అన్ని ప్రధాన రంగాల షేర్లు నష్టాలను నమోదు చేయడం మార్కెట్​ పతానానికి కారణమైంది. హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లలలో భారీగా విక్రయాలు నమోదయ్యాయి.

53,608 వద్ద ప్రారంభమైన బీఎస్​ఈ సెన్సెక్స్​ ఓ దశలో 53,632 గరిష్ఠాన్ని నమోదు చేయగా.. కనిష్ఠంగా 52,702 పాయింట్లకు పతమైమంది. 16,021 వద్ద ప్రారంభమైన నిఫ్టీ కూడా గరిష్ఠంగా 16,041ను తాకింది. ఓ దశలో 15,735 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రతికూలతలు నమోదయ్యాయి. ఆసియాలోని టోక్యో, హాంకాంగ్​, సియోల్, షాంగై మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. ఐరోపా, అమెరికా స్టాక్​ ఎక్స్ఛేంజీలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం సెషన్​లో విదేశీ పెట్టుబడి దారులు భారీ మొత్తంలో షేర్లను విక్రయించడం కూడా మార్కెట్​ పతనానికి కారణమని తెలుస్తోంది.

  • బీఎస్​ఈ సెన్సెక్స్​లో టాటా స్టీల్​, బజాజ్​ ఫైనాన్స్​, హెచ్​డీఎఫ్​సీ, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ మొదలైన దిగ్గజ సంస్థలు నష్టాలను నమోదు చేయగా.. విప్రో, హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​ షేర్లు మాత్రమే లాభాలు అర్జించాయి.

12:39 May 12

సెన్సెక్స్​ 1000 డౌన్​: స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 1000 పాయింట్లకుపైగా నష్టంతో.. 53 వేల 70 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 320 పాయింట్లు కోల్పోయి.. 15 వేల 840 వద్ద ఉంది. ఐటీ షేర్లు మినహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. మార్కెట్లు నష్టాల్లో ఉండటం ఇది వరుసగా ఐదో సెషన్​ కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, చైనాలో కొవిడ్​ కేసులు పెరగడం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం మార్కెట్ల నష్టాలకు కారణంగా విశ్లేషిస్తున్నారు నిపుణులు. ఆర్​బీఐ వడ్డీ రేట్లు పెంచినప్పటినుంచి సెన్సెక్స్​ దాదాపు 7 శాతం కుంగడం గమనార్హం. హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, టెక్​ మహీంద్రా, ఏషియన్​ పెయింట్స్​ లాభాల్లో ట్రేడవుతున్నాయి. హిందాల్కో, అదానీ పోర్ట్స్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ ఐదు శాతానికిపైగా నష్టపోయింది. బజాజ్​ ఫినాన్స్​, టాటా మోటార్స్​ కూడా భారీగా పతనమయ్యాయి.

09:20 May 12

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్​ 900 డౌన్​.. 16 వేల దిగువకు నిఫ్టీ

Stock Market Live Updates: స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ దాదాపు 800 పాయింట్లకుపైగా నష్టంతో 53 వేల 260 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 250 పాయింట్లు కోల్పోయి.. 16 వేల దిగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు.. దేశీయ సూచీల నష్టాలకు కారణంగా తెలుస్తోంది. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో టీసీఎస్​ మినహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.
మంగళూరు రిఫైనరీ, ఓరియంట్ సిమెంట్‌, కేఆర్‌బీఎల్‌, కల్పతరు పవర్‌, జీహెచ్‌సీఎల్‌ షేర్లు భారీగా లాభపడగా.. రిలాక్సో ఫుట్‌వేర్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎల్గీ ఎక్విప్‌మెంట్స్‌, ప్రిసమ్‌ జాన్సన్‌ షేర్లు భారీగా కుంగాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్‌ సూచీలైన డౌ జోన్స్‌ 1.2శాతం, ఎస్‌అండ్‌పీ 500 1.65 శాతం, నాస్‌డాక్‌ 3.18శాతం కుంగాయి. ఆ ప్రభావం భారత్‌ మార్కెట్లపై కూడా ప్రతికూలంగా పడింది. నేటి ఉదయం ఆసియా మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. హాంగ్‌సెంగ్‌, నిక్కీ సూచీలు 1.1శాతం పడిపోయాయి. స్ట్రెయిటైమ్స్‌, కేవోఎస్‌పీఐ సూచీలు 0.5శాతం పతనం అయ్యాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 5శాతం, డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 6శాతం చొప్పున పెరిగాయి. ఇవి పీపాకు వరుసగా 105, 107 డాలర్లు పలుకుతున్నాయి.

Last Updated :May 12, 2022, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.