ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9PM

author img

By

Published : Feb 28, 2021, 8:56 PM IST

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. రేపే రెండో విడత వ్యాక్సినేషన్​

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 102 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రక్రియను చేపట్టనున్నారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే వ్యాక్సిన్‌ అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'ప్రత్యామ్నాయం ప్రకటించాలి'

కేంద్రం తక్షణం చొరవ తీసుకుని హైదరాబాద్‌ ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ప్రకటించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశారు. ఐటీ రంగంలో దేశంలోనే కీలకంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ వంటి నగరానికి ఐటీ క్లస్టర్‌ ఎంతో అవసరమని లేఖలో ప్రస్తావించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'ఫీజు వేధింపులు ఆపకపోతే..దిగుతాం'

ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను.. కార్పొరేట్​ విద్యాసంస్థలు వేధిస్తే ఊరుకోబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పష్టం చేశారు. వేధింపులు ఆపకపోతే భాజపా యువమోర్చా ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతుందని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కొద్ది గంటల్లో పెద్ద గట్టు జాతర

సూర్యాపేటలో పెద్దగట్టు జాతర మరికొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. దేవరపెట్టె ఈ అర్థరాత్రి కేసారం నుంచి బయలుదేరనుంది. గంపల ప్రదర్శన, ముద్రపోలు అనంతరం అధికారికంగా జాతర మొదలుపెడతారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'ట్రాక్టర్లను సిద్ధం చేయండి'

చట్టాల రద్దు కోసం రైతు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఉద్యమ నేత రాకేశ్​ టికాయిత్. అందులో భాగంగా దిల్లీకి ఏ క్షణమైనా పయనమై వెళ్లేందుకు రైతులంతా తమ ట్రాక్టర్లను సిద్ధంగా ఉంచాలని ​ పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'అంబానీ ఇంటి వద్ద ఆ కారును మేమే పార్క్​ చేశాం'

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన కారును తామే పార్క్​ చేసినట్లు జైష్​ ఉల్​ హింద్​ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. పీఎస్‌ఎల్‌వీ-సీ51 సక్సెస్

భారతదేశ సత్తాను ఇస్రో మరోసారి ప్రపంచానికి చాటింది. 2021లో చేపట్టిన తన తొలి ప్రయోగం విజయవంతమైంది. తన 78వ ప్రయోగమైన పీఎస్​ఎల్వీ సీ -51 నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. టీకాకు చైనా అనుమతి

సింగిల్ డోసు టీకాకు చైనా ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు గ్లోబల్​ టైమ్స్​ పత్రిక తెలిపింది. జాన్సన్ అండ్ జాన్సన్​ సంస్థ రూపొందించిన సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​కు అమెరికా-ఎఫ్​డీఏ అనుమతి ఇచ్చిన కొద్ది గంటల్లోనే చైనా అనుమతులు ఇవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. పసిడి గెల్చుకున్న వినేశ్

భారత రెజ్లర్​ వినేశ్ ఫొగాట్​ బంగారు పతకం గెలుపొందింది. ఉక్రెయిన్ వేదికగా జరిగిన రెజ్లింగ్ పోటీల్లో 53 కేజీల విభాగంలో బెలూరస్​ రెజ్లర్​ వెనెసాపై విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కారణం చెప్పిన రాశీ

కిక్ బాక్సింగ్ ప్రాక్టీసుతో బిజీగా ఉన్న నటి రాశీఖన్నా.. అది నేర్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈమె ఓ వెబ్​సిరీస్, పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.