ETV Bharat / city

car driver on ongole incident: 'అలా చేస్తామని చెప్పడంతో సీఎం కాన్వాయ్‌కి కారు అప్పగించా'

author img

By

Published : Apr 21, 2022, 7:30 PM IST

car driver on ongole incident: ఏపీ సీఎం కాన్వాయ్​కి ప్రయాణీకుల కారును స్వాధీనం ఘటనపై డ్రైవర్ సునీల్ కుమార్ మరింత సమాచారం ఇచ్చారు. ఒంగోలులో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. కారుకు ఫిట్​నెస్ లేదు.. కేసు రాస్తామనడంతో భయపడి తన కారును సీఎం కాన్వాయ్​కి అప్పగించినట్లు చెప్పారు.

car driver on ongole incident
డ్రైవర్ సునీల్ కుమార్

car driver on ongole incident: ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో సీఎం జగన్ కాన్వాయ్‌ కోసం ప్రయాణికుల కారును స్వాధీనం చేసుకున్న ఘటనపై డ్రైవర్​ సునీల్​ కుమార్ మరిన్ని వివరాలు అందించారు. వేమూరు శ్రీనివాస్ అనే అతను.. వినుకొండ నుంచి తిరుపతి వెళ్లేందుకు ట్రావెలర్స్ కారును అద్దెకు తీసుకున్నారు. తిరుపతి వెళ్లుండగా ఒంగోలులో టిఫిన్ చేయడానికి ఆగాము. ఇంతలో ఇద్దరు అధికారులు వచ్చి కారు కాగితాలు అడిగారు. అందులో ఓ మహిళా అధికారి ఆ పత్రాలను తీసుకెళ్లారు. కానిస్టేబుల్.. కారును సీజ్ చేస్తున్నామని చెప్పి తీసుకెళ్లారు.

శుక్రవారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సీఎం కాన్వాయికి వాహనం పెట్టాలని అడగ్గా.. నేను నిరాకరించాను. నీ వాహనానికి ఫిట్​నెస్​ కాలపరిమితి ముగిసింది.. కేసు రాస్తే పలుమార్లు తిరగాల్సి వస్తుందని కానిస్టేబుల్​ బెదిరించారు. దీంతో భయపడి కారును అధికారులకు అప్పగించాను. కాన్వాయ్​గా పెట్టినందుకు రూ. 2 వేలు ఇచ్చారు. వినుకొండ నుంచి మరో కారు తెప్పించి ప్రయాణికులను తిరుపతికి పంపించాను. నేను ఆ రాత్రే వినుకొండకు వెళ్లిపోయాను. ఉదయాన్నే అధికారులు ఫోన్ చేయడంతో మళ్లీ ఒంగోలు వచ్చాను.

'ఆ భయంతోనే అధికారులకు కారు అప్పగించా'

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.