ETV Bharat / city

AP CM JAGAN: 24 గంటలూ.. పిల్లలకు వైద్య సేవలు

author img

By

Published : Jun 29, 2021, 8:07 AM IST

కరోనా మూడో దశపై ముందస్తు ఏర్పాట్లపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి(CM JAGAN) వైద్యులు, అధికారులతో చర్చించారు. ముందస్తు ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. చిన్నపిల్లల వైద్యసేవలకోసం నిరంతరం(24 గంటలు) అవసరాలకు అనుగుణంగా 150 మంది పీడియాట్రీషన్లతో టెలీ సేవలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూ సడలింపులపై కీలక మార్పులు ప్రకటించారు.

CM JAGAN ON CHILDREN 24 HRS HEALTH SERVICES
24 గంటలూ.. పిల్లలకు వైద్య సేవలు

'కరోనా మూడో దశ సమాచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లో పిల్లల చికిత్సకు అవసరమైన వసతులు మెరుగుపరచాలి. రోజంతా (24 గంటలూ) పీడియాట్రిక్‌ సేవలు అందుబాటులో ఉండాలి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని' ఏపీ సీఎం జగన్‌(CM JAGAN) ఆదేశించారు. ఏపీలో కరోనా పరిస్థితులు, మూడో దశకు సంబంధించిన జాగ్రత్తలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్షించారు. కొత్తగా తీసుకునే వైద్యులకు కూడా వెబినార్లో చర్చించిన అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

కర్ఫ్యూ సడలింపులపై వివరణ..

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్​లో కర్ఫ్యూ వేళలను 8 జిల్లాల్లో సడలించాలని, 4 జిల్లాల్లో యథాతథంగా కొనసాగించాలని, ఒక జిల్లాలో పొడిగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారు. పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రస్తుతం సాయంత్రం ఆరు గంటల వరకే ఉన్న కర్ఫ్యూ వేళలను రాత్రి 9 గంటల వరకూ సడలించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా ఎక్కువగా ఉన్న పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నట్లుగానే సాయంత్రం 6 గంటల వరకే సడలింపు ఉంటుంది. ఆయా జిల్లాల్లో ఎటువంటి మార్పు లేదు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉన్న సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకూ పొడిగించారు. జులై 1 నుంచి 7వ తేదీ వరకు ఈ నిర్ణయాలు అమలులో ఉంటాయని జగన్‌ వెల్లడించారు.

అధికారులు ఏం చెప్పారంటే..

  • ప్రస్తుతం 44,773 క్రియాశీల కరోనా కేసులున్నాయి. ఇందులో 7,998 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 96.95 శాతంగా, పాజిటివిటీ రేటు 4.46శాతంగా ఉంది.
  • 3,329 బ్లాక్‌ ఫంగస్‌ కేసులున్నాయి. 1,441 మంది చికిత్స పొందుతున్నారు. 253 మంది చనిపోయారు.
  • మూడోదశ దృష్ట్యా ఇప్పటికే మూడు దఫాలుగా నిపుణులతో వెబినార్‌ నిర్వహించాం.
  • కొవిడ్‌ బాధితులకు మానసిక నిపుణులతో సలహాలు అందిస్తున్నాం. 190 మంది సైకియాట్రిస్టులు, 16 మంది క్లినికల్‌ సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నాం.

ఏపీ సీఎం ఏమన్నారంటే..

  • 104 ద్వారా పిల్లలకు చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఇందుకోసం 150 మంది పీడియాట్రీషన్లతో టెలీ సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. వారందరికీ శిక్షణ ఇప్పించాలి. ఎయిమ్స్‌ లాంటి అత్యుత్తమ సంస్థల నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. జిల్లాల్లో సంబంధిత జేసీలను కూడా 104 సేవల్లో భాగస్వాములను చేయాలి.
  • అడ్మిషన్లు అవసరమైతే తక్షణమే స్పందించి పడకలు ఇచ్చేలా చూడాలి. ఇందుకనుగుణంగా వ్యవస్థను బలోపేతం చేయాలి. సీజనల్‌ వ్యాధులకూ 104 ద్వారా సేవలు అందించాలి. విలేజి క్లినిక్కులు, పీహెచ్‌సీలతో పాటు 104 కూడా ఆరోగ్యశ్రీకి రిఫరెల్‌ పాయింటులా ఉండాలి.
  • ఏపీ మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఇద్దరు వైద్యులను నియమించాం. వారు నెలకు రెండు సార్లు గ్రామాల్లో పర్యటించాలి.

ఇదీ చదవండి: SCHOOL FEE: స్కూల్​ ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.