ETV Bharat / city

మాట తప్పారు.. మడమ తిప్పారు!.. నాలుక మడతేశారు.! మడమ ఎన్నోవంకర్లు తిప్పారు

author img

By

Published : Oct 14, 2022, 2:20 PM IST

మాట తప్పారు.. మడమ తిప్పారు!.. నాలుక మడతేశారు.!
మాట తప్పారు.. మడమ తిప్పారు!.. నాలుక మడతేశారు.!

Jagan comments about the three capitals: మాట తప్పడు.. మడమ తిప్పడు! ఇది.. జగన్‌ పేటెంట్ అనేంతగా డైలాగ్‌లు కొడుతుంటారు వైకాపా నేతలు.! మరి రాజధానిపై ఇచ్చిన మాటకు జగన్‌ కట్టుబడ్డారా.? రైతులు రోడ్డెక్కినా..? కోర్టులు అక్షింతలు వేసినా? వైకాపా మినహా మిగతా పార్టీలన్నీ ముంక్తకంఠంతో మొత్తుకుంటునన్నా మా మూడు మారదంటూ మూడు రాజధానుల పాట పాడుతున్న జగన్‌.. అమరావతిపై అప్పుడేం చెప్పారు? ఇప్పుడు నాలుక ఎలా మడతేశారు.! మడమ ఎన్నివంకర్లు తిప్పారు.? అమరావతిపై అధికారంలోకి రాకముందు.. జగన్‌ ఏమేం ఊదరగొట్టారో ఒక్కసారి చూద్దాం.

Jagan comments about the three capitals: ఎన్నికల మేనిఫెస్టో.. జగన్‌ మాటల్లో చెప్పాలంటే. అది.. వైకాపా ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీత.! మరి 2014 ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా.. ఆయన రాజధాని మీద ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. 2014 ఎన్నికల్లో వైకాపా ఓడింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అప్పటికి రాజధాని ఎక్కడో నిర్ణయం కాలేదు. అసలు మీ మనసులో.. ఏముందని జాతీయ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే జగన్‌ ఇదిగో ఇలా చెప్పారు.

2014లో రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని సూచన: రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండేలా చూడండి. కనీసం 30 వేల ఎకరాలుండేలా చూడండి. పుష్కలంగా నీరు అందుబాటులో ఉండేలా చూడండి. ఈ మూడు అంశాలు దృష్టిలో పెట్టుకుంటే.. పరిణామాలన్నీ మంచి ఆకృతి దాలుస్తాయి. నా సింపుల్‌ సలహా ఏంటంటే రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలి.

మాట తప్పారు.. మడమ తిప్పారు!.. నాలుక మడతేశారు.!

ఇక అమరావతి ప్రకటన రానే వచ్చింది. సీఎంగా చంద్రబాబు అసెంబ్లీలో రాజధానిపై అధికారిక ప్రకటన చేశారు. ఆరోజు జగన్‌ ప్రసంగం వింటే.. ఇవాళ 3రాజధానులంటోంది ఆయనేనా? అని.. కరుడుగట్టిన వైకాపా అభిమానులు కూడా నోరెళ్లబెట్టాల్సిందే. ఇక రాజధాని పర్యటన సందర్భంగా.. అమరావతి పరిధిలోని జనాలు.. ఈలవేసి గోలచేసేంతగా ప్రసంగాలు చేశారు జగన్‌.

మాట తప్పారు.. మడమ తిప్పారు!.. నాలుక మడతేశారు.!
మాట తప్పారు.. మడమ తిప్పారు!.. నాలుక మడతేశారు.!

ఇక విజయవాడ-గుంటూరు మధ్య జరిగిన వైకాపా ప్లీనరీలోనైతే.. అమరావతే అచ్చెరువొందే స్పీచ్ ఇచ్చారు జగన్‌. ప్రతిపక్షనేతగా అమరావతికి అనుకూలంగా ఇన్ని సందర్భాల్లో అభయమిచ్చిన జగన్‌.. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయ్‌... ఏపీకి ఎందుకు ఉండకూడదంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. మాట తప్పేసి, మడమ తిప్పేసి వికేంద్రీకరణ పల్లవి అందుకున్నారు.

మాట తప్పారు.. మడమ తిప్పారు!.. నాలుక మడతేశారు.!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.