ETV Bharat / city

AP CM Jagan on paper leak: వారి పాఠశాలల నుంచే ప్రశ్నపత్రాలు లీక్: జగన్

author img

By

Published : May 5, 2022, 6:21 PM IST

AP CM Jagan on paper leak: నారాయణ, శ్రీచైతన్య కళాశాలల నుంచే.. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకులు అయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే పదోతరగతి పేపర్లు లీక్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

AP CM Jagan on Ammavodi
ఏపీ ముఖ్యమంత్రి జగన్

AP CM Jagan on paper leak: వైకాపా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే పదోతరగతి పేపర్లు లీక్‌ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణకు చెందిన రెండు పాఠశాలలు.. మూడు చైతన్య స్కూల్స్‌ నుంచే ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని ఆరోపించారు. జగనన్న విద్యాదీవెన పథకం నిధులను.. తిరుపతి వేదికగా విడుదల సీఎం చేశారు. గత ప్రభుత్వాలేవీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఇవన్నీ తట్టుకోలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

"జగనన్న అమ్మఒడి కార్యక్రమానికి రూ.13,023 కోట్లు ఖర్చు చేశాం. జూన్‌లో అమ్మఒడి కార్యక్రమానికి మరో రూ.6400 కోట్లు ఇస్తాం. తగిన చర్యలు తీసుకున్నందునే రాష్ట్రంలో మార్పు కనిపిస్తోంది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల సంఖ్య 73 లక్షలకు చేరింది."

- జగన్, ఏపీ ముఖ్యమంత్రి

అత్యాచారాలకు పాల్పడింది తెలుగుదేశం వ్యక్తులేనని సీఎం జగన్ ఆరోపించారు. విజయవాడతో పాటు గుంటూరు జిల్లాలో జరిగిన అత్యాచారాలపై నానా యాగీ చేశారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఏదేదో జరిగిపోతోందంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ మూడు ఘటనల్లో మహిళలు, బాలికలపై అత్యాచారం చేసిన దుర్మార్గులు తెదేపా నేతలేనని చెప్పారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు.

వారి పాఠశాలల నుంచే ప్రశ్నపత్రాలు లీక్: జగన్

ఇదీ చదవండి: హృదయం లేని జగన్ రెడ్డి పాలనలో.. ఎన్నో దారుణాలు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.