ETV Bharat / city

CM JAGAN: 'ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం'

author img

By

Published : Apr 28, 2022, 3:53 PM IST

పేదలకు మంచి చేద్దామంటే ప్రతిపక్షాలు, మీడియా అడ్డుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ మండిపడ్డారు. పేదల ఇళ్లు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, మూడు రాజధానులు సహా అన్నింటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. 'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో లే-అవుట్లను పరిశీలించిన జగన్.. ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

CM JAGAN: 'ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం'
CM JAGAN: 'ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం'

ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. 'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో లే-అవుట్లను జగన్ పరిశీలించారు. అగ్రహారంలో పార్కును ప్రారంభించి.. ల్యాండ్‌ పూలింగ్‌కు భూమి ఇచ్చిన రైతులతో ఫొటో సెషన్ నిర్వహించారు. లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు, హౌసింగ్‌ స్కీమ్‌ పత్రాలను అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు.

CM JAGAN: 'ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం'

రాష్ట్రంలో సుమారు 30.7 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్నామని జగన్ చెప్పారు. ఒక్క కాలనీలోనే 10,228 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. పైడివాడ అగ్రహారంలో లక్షా 23 వేల మందికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి మహిళకు రూ.10 లక్షల విలువైన ఇల్లు ఇస్తున్నామని అన్నారు. స్థలాలు, ఇళ్లకు మొత్తం రూ.55 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే 15.6 లక్షల ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు వస్తున్నాయని అన్నారు. త్వరలో రెండోదశ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. ఇళ్లు లేనివారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పూర్తి చేస్తామన్న జగన్‌.. పథకం పూర్తి చేసి శ్రీకాకుళం వరకు నీళ్లు తీసుకెళ్తామన్నారు.

"పేదలకు మంచి చేద్దామంటే ప్రతిపక్షాలు, మీడియా అడ్డుకుంటున్నాయి. పేదల ఇళ్లు, ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలు, మూడు రాజధానులు సహా అన్నింటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు కూడా రానివ్వకుండా అడ్డు తగులుతున్నారు. ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా మూడు రాజధానుల్లో ఒకటి విశాఖకు ఇస్తానంటే ఆటంకాలు కల్పిస్తున్నారు. వాళ్ల రాజధాని అని చెప్పుకుంటున్న అమరావతిలోనైనా పేదలకు 54 వేల ఇళ్ల పట్టాలు ఇస్తానంటే కోర్టుకు వెళ్లారు. వారు కోర్టులో ఏం చెప్పారో తెలుసా.. డెమోగ్రాఫిక్‌ ఇన్​బ్యాలెన్స్‌ వస్తుందట. అంటే వాళ్ల మధ్య పేదవాడు ఉంటే సమతుల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు అక్కడ న్యాయ రాజధాని తీసుకొస్తానంటే దాన్నీ అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలోని పేదలకు ఏ మంచి జరిగినా వీరికి కడుపుమంటగా ఉంది"- జగన్‌, ముఖ్యమంత్రి

ఇవీ చదవండి..

cm kcr review: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధి ఎత్తిపోతల పథకాలపై సీఎం సమీక్ష

స్టార్​ నటుల 'హిందీ' వార్​కు పొలిటికల్ ట్విస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.