ETV Bharat / city

దోచుకోవడం.. దాచుకోవడమే వైకాపా పాలన: చంద్రబాబు

author img

By

Published : Apr 15, 2021, 5:07 PM IST

దోచుకోవడం.. దాచుకోవడమే వైకాపా పాలన అని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని మండిపడ్డారు. అక్రమ కేసులు, అమాయకులను హత్య చేయడం ఎక్కువైందన్నారు. తిరుపతి పవిత్రతను దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన చెందారు.

chandrababu naidu comments on cm jagan
ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు

వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్​ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్‌ పరిపాలనలో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు 6 డీఏలు పెండింగ్ పెట్టారని.. పీఆర్‌సీకి ఇంకా అతీగతీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేయడంలో రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందని.. రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన ఎక్కువగా ఉందని విమర్శించారు. అక్రమ కేసులు, అమాయకులను హత్య చేయడం ఎక్కువైందన్నారు.

ప్రభుత్వ పాలన తీరుపై తిరుపతి ప్రజల్లో ఎంతో ఆవేదన ఉందని.. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించిన తనకు ఈ విషయం అర్థమైందని చంద్రబాబు చెప్పారు. తిరుపతి పవిత్రత దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆయన ఆగ్రహించారు. ఎర్రచందనాన్ని చైనా వరకు అక్రమ రవాణా చేస్తున్నారని.. తిరుపతిలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తితిదే ఆస్తులు అమ్మేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక దోపిడీ బాగా ఎక్కువైందని చంద్రబాబు అన్నారు. దేవాలయాలపై దాడుల్లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా మారిందని.. చెప్పారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా సీఎం ఏమీ పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల వేధింపులు తట్టుకోలేక అనేకమంది వలసలు వెళ్తున్నారని అన్నారు.

'164 దేవాలయాలపై దాడులు ఎందుకు జరిగాయి. రామతీర్థం వెళ్లానని నాపై కేసులు పెడతారా. తిరుపతిలో రాళ్ల దాడి జరిగితే నన్ను ఆధారాలు అడుగుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. సుక విధానం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. 40 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగి పనులు ఆగిన పరిస్థితి నెలకొంది. బోధనా ఫీజుల చెల్లింపులు చేయడం లేదు.గురుకుల విద్యార్థులకు ఆహారం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. మొత్తం 28 మంది ఎంపీలతో మీరు ఏం సాధించారు.? రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్యాకేజ్ ఏమైంది.? విశాఖ రైల్వే జోన్‌ ఏమైనా సాధించారా? దోచుకోవడం.. దాచుకోవడం తప్ప.. వైకాపా పాలనలో మరేమీ లేదు.'- చంద్రబాబు నాయుడు, తెదేపా అధినేత

ఇదీ చదవండి: సంక్షేమ పథకాల్లో తెరాస సర్కార్ టాప్: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.