ETV Bharat / city

ఎన్​సీడీసీకి స్థలం కేటాయించాలని కేసీఆర్​కు కిషన్ రెడ్డి లేఖ

author img

By

Published : Jan 25, 2021, 7:15 PM IST

జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రానికి హైదరాబాద్​లో స్థలం కేటాయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి... సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. ఎన్​సీడీసీ ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్యరంగానికి కేంద్ర బిందువుగా మారనుందని అభిప్రాయపడ్డారు.

central minister kishan reddy wrote letter to cm kcr for ncdc land
ఎన్​సీడీసీకి స్థలం కేటాయించాలని కేసీఆర్​కు కిషన్ రెడ్డి లేఖ

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేయనున్న జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రానికి స్థలం కేటాయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి... ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు. దీనికోసం కనీసం మూడు ఎకరాల స్థలం అవసరం అవుతుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ... రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు గుర్తు చేశారు. అందుకు కావాల్సిన స్థలం కేటాయింపునకు తెలంగాణ ప్రభుత్వం సూత్రపాయంగా అంగీకరించినట్టు తెలిపారు.

ఎన్​సీడీసీని హైదరాబాదులో ఏర్పాటు చేస్తే... ఇప్పటికే విజయవంతంగా పని చేస్తున్న ఎన్​ఐఎన్​, సీసీఎంబీ, ఐఐసీటీ లాంటి అనేక కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలతోపాటు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఒక కీలక సంస్థగా రూపుదిద్దుకోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంలో ఇటువంటి సంస్థ ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అనేక వైద్యశాలలకు, వైద్యరంగ పరిశోధనలకు కేంద్ర బిందువుగా నిలిచే విధంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని తీర్చిదిద్దనుందన్నారు.

ఇదీ చూడండి: నోట్ల ఉపసంహరణపై క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.