'తెరాస నుంచి వలసలు మొదలు.. ఆ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం'

author img

By

Published : Oct 10, 2022, 1:01 PM IST

bjp meeting

BJP meeting in medak: తెరాస నుంచి వలసలు మొదలయ్యాయని.. త్వరలో ఆ పార్టీ ఖాళీ అవుతుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో నిర్వహించిన భాజపాలో చేరికల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నర్సాపూర్ పురపాలక చైర్మన్ మురళీ యాదవ్, పరకాల మాజీ ఎమ్మెల్యే బిక్షపతికి ఆయన కండువా కప్పి కమలం గూటికి చేర్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

BJP meeting in medak: భాజపా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో పలువురు నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువా కప్పారు. ఈ సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, పార్టీ వ్యవహరాల బాధ్యులు తరుణ్ చుంగ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటి చైర్మన్ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్​తో పాటు పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు వర్షం పడటంతో.. సభాప్రాంగణం అంతా బురదమయం కావడంతో వచ్చిన కార్యకర్తలు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబమే బాగుపడిందని ఆరోపించారు. ప్రజలను మభ్య పెట్టడానికే పథకాలు తీసుకు వస్తున్నారని.. దళిత బంధు ప్రచారానికే పరిమితమైందని భూపేందర్ యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెలో అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తుంటే.. మరోవైపు రాజస్థాన్​లో లుకలుకలు ప్రారంభమయ్యాయని.. పార్టీనే పటిష్టం చేసుకోలేని వ్యక్తి దేశాన్ని ఏం చేస్తాడని భూపేందర్ ఎద్దేవా చేశారు.

తెలంగాణలో ఒక్క కుటుంబమే బాగుపడింది. ప్రజలను మభ్యపెట్టడానికే పథకాలు తీసుకువస్తున్నారు. దళిత బంధు ప్రచారానికే పరిమితం అయ్యింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలమయ్యింది. తెలంగాణ ప్రజలు పార్పు కోరుకుంటున్నారు.రాహుల్​ గాంధీ జోడో యాత్ర చేస్తుంటే.. రాజస్థాన్​లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. పార్టీనే పాలించలేని వ్యక్తి దేశాన్ని ఎలా పాలిస్తాడు. - భూపేందర్‌యాదవ్, కేంద్ర మంత్రి

కేసీఆర్​ మంత్రగాడిలా తయారయ్యారు.. కేసీఆర్ మంత్రగాడిగా మారాడని.. రాష్ట్రానికి అమ్రీష్ పూరీలా అయ్యాడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపించారు. మూడనమ్మకాలతో సచివాలయాన్ని కూల్చేశారని బండి సంజయ్ విమర్శించారు. తెరాస నుంచి బయటికి రావడానికి నాయకులు క్యూ కట్టారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో చనిపోయిన రైతులను పట్టించుకోని కేసీఆర్.. పంజాబ్‌లో చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వడాన్ని విమర్శించారు. ప్రచార రధం, కారుకు రుణాలు తిరిగి చెల్లింపు చేయలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం.. దేశ విదేశాల్లో ఆస్తులు ఎలా సంపాదించిందో ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ మంత్రగాడిగా మారాడు. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో క్షుద్రపూజలు చేస్తున్నారు. మూడనమ్మకాలతో సచివాలయాన్ని కూల్చేశారు. రైతుబంధు పెట్టి వ్యవసాయనికి ఇచ్చే అన్నీ సబ్సీడీలు రద్దు చేశాడు. తెరాస నుంచి బయటికి రావడానికి నాయకులు క్యూ కట్టారు. రాష్ట్రంలో చనిపోయిన రైతులను పట్టించుకోని కేసీఆర్.. పంజాబ్‌లో చనిపోయిన రైతులకు పరిహారం ఇచ్చారు. కనీసం ఉద్యోగులకు జీతం ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఖజానా దిగజారింది. తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడానికి చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకుంటున్నారు.. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

బహిరంగ సభకు ప్రజలు రాకుండా తెరాస నాయకులు అడ్డుకున్నారు.. బహిరంగ సభకు ప్రజలు రాకుండా తెరాస నాయకులు అడ్డుకున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ గట్టి బుద్ధి చెప్పారని ఈటల పేర్కొన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేక.. తనను ఎదుర్కోలేక అసెంబ్లీ నుంచి బయటికి పంపించారని రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో మద్యం, బెల్టు దుకాణాలు పెంచి.. కేసీఆర్ విక్రయాలను విచ్చలవిడిగా పెంచాడని ఈటల విమర్శించారు. ఈ మద్యం వల్ల మరణాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులోనూ భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బహిరంగ సభకు ప్రజలు రాకుండా తెరాస నాయకులు అడ్డుకున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ గట్టి బుద్ధి చెప్పారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేక.. తనను ఎదుర్కోలేక అసెంబ్లీ నుంచి బయటికి పంపించారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో మద్యం, బెల్టు దుకాణాలు పెంచి.. కేసీఆర్ విక్రయాలను విచ్చలవిడిగా పెంచారు. మునుగోడులోనూ భాజపా గెలుస్తుంది. తాము అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇప్పటికంటే మెరుగ్గా అమలు చేస్తాము. సుపరిపాలన అందిస్తాం. - ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే

మెదక్​లో నిర్వహించిన భాజపాలో చేరికల సభ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.