మోదీ కేవలం గుజరాత్‌కే ప్రధాని.. కేటీఆర్ సెటైర్
Published: Oct 10, 2022, 12:26 PM


మోదీ కేవలం గుజరాత్‌కే ప్రధాని.. కేటీఆర్ సెటైర్
Published: Oct 10, 2022, 12:26 PM
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి భాజపాపై మండిపడ్డారు. ఇప్పటికే పలుమార్లు ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్.. కేంద్ర సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపైనా ప్రశ్నించారు. అయితే తాజాగా మోదీపై పలు సెటైర్స్ చేశారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా భాజపాపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. గుజరాత్‌కు కేటాయించిన నిధులపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ... తనదైన శైలిలో సెటైర్స్ చేశారు. ప్రధాని మోదీ గుజరాత్‌కు... గుజరాత్ కోసం... గుజరాత్ ప్రధానిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? లేకా మోదీ స్వామ్యమా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. గుజరాత్ కోసం చేసే ప్రకటనలు తాయిలాలు కావా అంటూ ట్విటర్‌లో నిలదీశారు.
-
ప్రధానమంత్రి మోడీ గారు కేవలం గుజరాత్ రాష్ట్రానికే ప్రధానమంత్రి…తెలంగాణకు కాదు !
— Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) October 10, 2022
సాక్ష్యాలు ఇవే👇#ModiPMofGujarat pic.twitter.com/1Dna9a7LSb
ఇవీ చూడండి:
'ధరణి పుత్రుడు' ములాయం మృతి పట్ల ప్రముఖుల సంతాపం- మోదీ భావోద్వేగం!
