ETV Bharat / city

సమస్యల పరిష్కారానికి కేసీఆర్​ సహకరించడం లేదు: బండి సంజయ్​

author img

By

Published : Jul 31, 2020, 7:20 PM IST

Updated : Jul 31, 2020, 8:19 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్​ సహకరించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ సలహాతోనే.. అపెక్స్ సమావేశం వాయిదా వేయాలని కేసీఆర్ కోరుతున్నారన్నారు.

BANDI SANJAY
సమస్యల పరిష్కారానికి కేసీఆర్​ సహకరించడం లేదు: బండి సంజయ్​

తెలుగు రాష్ట్రాల నీటి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే సీఎం కేసీఆర్ సహకరించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నీటి వాటాల పంపిణీలో కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు.

సమస్యల పరిష్కారానికి కేసీఆర్​ సహకరించడం లేదు: బండి సంజయ్​

2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్​ సమావేశంలో 500 టీఎంసీలకు పైగా నీరు రాష్ట్రానికి రావాల్సి ఉన్నా.. కేసీఆర్​ నిర్లక్ష్యంతో కేవలం 200 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చాయన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ల పేరు చెప్పి.. ఆ కమీషన్లతో జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్-జగన్​ లోపాయికార ఒప్పందం చేసుకొని.. తెలుగు రాష్ట్రాలను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఆగస్టు మొదటి వారంలో పోతిరెడ్డిపాడు టెండర్లను తెరిచేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్​ ప్రయత్నిస్తున్నా.. సీఎం కేసీఆర్​లో కనీసం చలనం లేదన్నారు. ఏపీ సీఎం జగన్ సలహాతోనే..అపెక్స్ సమావేశం వాయిదా వేయాలని కేసీఆర్ కోరుతున్నారన్నారు.

విభజన చట్టం ప్రకారమే ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాలని మేము కేంద్రాన్ని కోరుతున్నామని బండి సంజయ్​ అన్నారు. ఆగస్టు 5వ తేదీ లోపల ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించకపోతే ఏపీ ప్రభుత్వం తెరిచేందుకు యత్నిస్తున్నా.. టెండర్లను ఆపేందుకు యత్నిస్తామన్నారు. కేంద్రంపై విమర్శలు చేస్తున్న కేసీఆర్​.. ఏపీ ముఖ్యమంత్రిపై ఎందుకు ఒక్క మాట మాట్లాడడం లేదని ప్రశ్నించారు. దళితులపై జరుగుతున్న దాడుల వ్యవహారాన్ని దారిమళ్లించేందుకే.. అపెక్స్ కమిటీ సమావేశంపై కేసీఆర్​ ప్రకటన చేశారని విమర్శించారు.

ఇవీచూడండి: పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్

Last Updated : Jul 31, 2020, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.