ETV Bharat / city

ఆ ప్రాంతాల్లో పిడుగులు.. జాగ్రత్తగా ఉండాలి: విపత్తుల నిర్వహణ శాఖ

author img

By

Published : May 4, 2022, 4:40 PM IST

ఆ ప్రాంతాల్లో పిడుగులు.. జాగ్రత్తగా ఉండాలి: విపత్తుల నిర్వహణ శాఖ
ఆ ప్రాంతాల్లో పిడుగులు.. జాగ్రత్తగా ఉండాలి: విపత్తుల నిర్వహణ శాఖ

Weather Update: తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు మృతి చెందారు. పలు జిల్లాలో ఈదురుగాలులతో వందల ఎకరాల్లో మామిడి నేలరాలింది.

ఆ ప్రాంతాల్లో పిడుగులు.. జాగ్రత్తగా ఉండాలి: విపత్తుల నిర్వహణ శాఖ

Weather Update: తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఏపీవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అదే సమయంలో గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మే 6 నాటికి పలు ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విపత్తు నిర్వాహణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా చాలాచోట్ల ఆకాశం మేఘావృతంగా మారింది. ఉత్తర కోస్తాంధ్ర, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని చాలాచోట్ల జల్లులు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో భారీగా ఈదురుగాలులకు.. వంద ఎకరాల్లో మామిడి నేలరాలింది. లక్షలాది రూపాయల పంట నష్టం వాటిల్లింది. ఉరుములు, మెరుపులు, గాలులు రావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు.

ఉరుములు-మెరుపులతో కూడిన వర్షం: ప్రకాశం జిల్లా దర్శిలోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రోహిణి కార్తె సమీపిస్తున్న తరుణంలో వర్షం పడటం వల్ల ఎండలు విపరీతంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అద్దంకి, జె.పంగులూరులోనూ వర్షం కురవడంతో శనగ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి, కురిచేడులో ఈదురుగాలులతో వర్షం పడింది.

పిడుగు హెచ్చరిక: పల్నాడు జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. మాచర్ల మండలం కంభంపాడులో పిడుగుపడి బాలుడు మృతి చెందాడు. ఇప్పటికే పల్నాడు జిల్లాకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. మాచర్ల, రెంటచింతల, గురజాల, దాచేపల్లి, వెల్దుర్తి, దుర్గి, కారెంపూడి, పిడుగురాళ్ల, బొల్లపల్లి మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని తెలిపింది. అకాల వర్షంతో మొక్కజొన్న, మిరప, వరి రైతులు ఆందోళనలో ఉన్నారు.

పిడుగుపాటు: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కొత్తూరులో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు.

బాపట్ల జిల్లా: బాపట్ల మండలం తూర్పుపిన్నిబోయినవారిపాలెంలో పిడుగుపడి సుబ్రమణ్యం అవే కూలీ మృతి చెందాడు. అద్దంకి మండలం ధర్మవరంలోనూ ఇంటిపై పిడుగు పడి నీళ్ల తొట్టి ధ్వంసమైంది. సంతమాగులూరు మండలంలో ఉరుములతో వర్షం పడుతోంది. ఈదురుగాలులకు విద్యుత్‌ తీగలపై ఫ్లెక్సీలు పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పరీక్షా కేంద్రాల్లో వెలుతురు లేక విద్యార్థుల అవస్థలు పడ్డారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. భారీగా వీస్తున్న గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోవూరు, నెల్లూరు సహా అనేక ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా నిలిచింది. బుజబుజ నెల్లూరులో కుండపోత వర్షం, ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులకు నెల్లూరులో విద్యుత్‌ తీగలపై ఫ్లెక్సీలు పడిపోయాయి.


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.