ETV Bharat / city

ugadi celebrations: వెరైటీ వేడుకలు.. బురదలో ఎద్దులు, గాడిద బండ్ల ఊరేగింపు

author img

By

Published : Apr 4, 2022, 12:31 PM IST

ugadi celebrations: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉగాది సంబురాలు ఘనంగా నిర్వహించారు. కల్లూరులోని చౌడేశ్వరీ ఆలయంలో ఎద్దుల, గాడిద బండ్ల ఊరేగింపు ఉత్సహంగా జరిగింది. ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

ugadi celebrations
బురదలో గాడిద బండ్ల ఊరేగింపు

ugadi celebrations: ఏపీలోని కర్నూలులో ఉగాది ఉత్సవాలు రెండో రోజూ ఘనంగా జరిగాయి. కల్లూరులోని చౌడేశ్వరీ ఆలయంలో పండగ వేడుకలు వైభవంగా కొనసాగాయి. చౌడేశ్వరీ ఆలయంలో చుట్టూ బురదనీరు ఏర్పాటు చేసి వాటిలో ఎద్దులు, గాడిద బండ్లను ఊరేగించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా బండ్ల ఊరేగింపుని ఉత్సాహంగా జరిపారు. బురదలో వస్తున్న బండ్లపైకి భక్తులు బురద చల్లుతూ.. ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఊరేగింపుని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

ugadi celebrations
బురదలో గాడిద బండ్ల ఊరేగింపు

ఇదీ చదవండి: Baby in plastic cover : నీలోఫర్ ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన.. ప్లాస్టిక్‌ కవర్‌లో పసికందు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.