కొడుకును నీట్​ పరీక్ష రాయమని చెప్పి... తండ్రి ఆత్మహత్య

author img

By

Published : Sep 12, 2021, 7:11 PM IST

suicide

హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వైద్యుడు హైదరాబాద్​లోని ఓ హోటల్​లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బెంగళూరుకు చెందిన డా.ఆర్.చంద్రశేఖర్ మెదక్​లో అనురాధ నర్సింగ్ హోమ్ పేరుతో ఆసుపత్రిని ఏర్పాటు చేసి తన‌ భార్యతో కలిసి గత 20 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యుడిగా మంచి పేరు సంపాదించిన చంద్రశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టాడు. ఆగస్టులో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను రిమాండ్​కు తరలించారు.

ఈ క్రమంలో నిజాంపేటలో తన కుమారుడికి నీట్ పరీక్ష ఉండటంతో ఈరోజు చంద్రశేఖర్ తన భార్యతో కలిసి వచ్చాడు. కుమారుడిని పరీక్షా కేంద్రం వద్ద విడిచిన తరువాత అతని భార్యకు అత్యవసర సర్జరీ కేసు ఉండటంతో తిరిగి మెదక్​ వెళ్లారు. చంద్రశేఖర్ కేపీహెచ్​బీ కాలనీలోని సితార్ గ్రాండ్ హోటల్​లో రూం నెంబర్​ 314 బస చేశాడు. గదిలోకి వెళ్లిన‌ అతను ఎంతకు బయటకు రాకపోవటంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హోటల్​కు చేరుకొని గది తలుపులు తెరిచి చూడగా చంద్రశేఖర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చంద్ర శేఖర్ భార్య వస్తే గాని అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు.

మెదక్ జిల్లాకు చెందిన రియల్​ ఎస్టేట్​ వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్​ను ఆగస్టు 9న రాత్రి హత్య చేసి కారు డిక్కిలోనే పెట్టి దగ్ధం చేశారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మెదక్​ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి 24 గంటల్లో హత్య చేసిన నిందితులను అరెస్ట్​ చేశారు.

సంబంధిత కథనాలు: MURDER: వ్యాపారి హత్య కేసులో పురోగతి​.. అసలెందుకు చంపారంటే..?

MURDER: వ్యాపారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. కారణం అదే!

MURDER: రియల్టర్ దారుణ హత్య... కారు డిక్కీలో వేసి కాల్చేశారు!

Murder: వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసులో మరో ట్విస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.