Murder: వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసులో మరో ట్విస్ట్​

author img

By

Published : Aug 22, 2021, 11:44 AM IST

srinivas murder

మెదక్ జిల్లాకు చెందిన వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్‌ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అతని హత్యకు వివాహేతర సంబంధమో, ఆర్థిక లావాదేవిలో కాదని తెలుస్తోంది. ఇది పూర్తిగా కిరాయి హత్యగా పోలీసులు ఒక స్పష్టతకు వచ్చారు.

మెదక్ జిల్లాకు చెందిన వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్​ను ఆగస్టు 9న రాత్రి హత్య చేసి కారు డిక్కిలోనే పెట్టి దగ్ధం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ కేసున ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మెదక్​ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి 24 గంటల్లో హత్య చేసిన నిందితుడిని అరెస్ట్​ చేశారు. హత్యకు వ్యాపార లావాదేవీలు లేక వివాహేతర సంబంధాలు కారణం కావచ్చన్న కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

శాస్త్రీయ ఆధారాలపై దృష్టి

కేసు మిస్టరీని ఛేదించడానికి పోలీసులు శాస్త్రీయ ఆధారాలపై ప్రధానంగా దృష్టి సారించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మొదట ఉహించినట్టుగా హత్యకు కారణం వివాహేతర సంబంధమో లేక వ్యాపార లావాదేవీలో కారణం కాదని నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం. ఇది పూర్తిగా కిరాయి హత్యగా పోలీసులు ఒక స్పష్టతకు వచ్చారు. వారి విచారణలో ఆశ్చర్యకరమైన కోణం వెలుగులోకి వచ్చింది. మృతుని కుటుంబ సభ్యులే సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితుల సెల్ ఫోన్ కాల్ హిస్టరీని పరిశీలించిన పోలీసులు ఈ మేరకు నిర్ధరణకు వచ్చారు.

కుటుంబ సభ్యుల పాత్రపై పూర్తి ఆధారాల సేకరణ

హత్య చేసినందుకు భారీగా డబ్బుతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పించేలా ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే కోణంలో ఇప్పటికే మృతుని భార్యను కూడా పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. హత్యలో కుటుంబ సభ్యుల పాత్రపై పూర్తి ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ రోజో రేపో అరెస్టు చేసి.. ఈ కేసుపై పోలీసులు అధికారికంగా స్పష్టత ఇవ్వనున్నారు.

సంబంధిత కథనాలు: MURDER: వ్యాపారి హత్య కేసులో పురోగతి​.. అసలెందుకు చంపారంటే..?

MURDER: వ్యాపారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. కారణం అదే!

MURDER: రియల్టర్ దారుణ హత్య... కారు డిక్కీలో వేసి కాల్చేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.