ETV Bharat / business

ఆ వాహనానికి 74 నెలలు! భారత్​లో కార్ల వెయిటింగ్​ పీరియడ్​ ఎంతో తెలుసా?

author img

By

Published : Mar 15, 2023, 10:53 AM IST

Updated : Mar 15, 2023, 11:35 AM IST

what-is-the-waiting-period-for-cars-in-india
ఇండియాలో కార్ల వెయిటింగ్​ పీరియడ్​

దేశంలో కార్ల కంపెనీలు చాలానే ఉన్నాయి. ఇవి కొత్త కొత్త మోడళ్లలో వస్తు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటికున్న డిమాండ్​ కారణంగా కొన్ని కార్లు వినియోగదారుల వద్దకు చేరేందుకు నెలల సమయం పడుతోంది. ఏఏ కంపెనీ కార్లకు ఎంత వెయిటింగ్​ పీరియడ్​ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం!

కార్ల విషయంలో వినియోగదారుల అభిరుచులు రోజురోజుకు మారుతున్నాయి. వారి ఆసక్తికి అనుగుణంగా కంపెనీలు సైతం కొత్తగా, వినూత్నంగా కార్లను తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తున్నాయి. కానీ వినియోగదారులు కోరుకున్న మోడళ్లను వెంటనే వారికి చేరవేసేందుకు కంపెనీలకు చాలా సమయం పడుతోంది. వాటికి డిమాండ్​ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. టయోటా హైక్రాస్ మోడల్​ కారు వినియోగదారుడిని చేరేందుకు దాదాపు 18 నెలల సమయం పడుతోంది. మహీంద్రా థార్ ఆర్​డబ్ల్యూడీ వాహనం కావాలంటే 74 వారాలు వేచి చూడాల్సిందే. మొత్తంగా 2023 మార్చి నెలలో కార్లను వినియోగదారులకు చేర్చేందుకు కంపెనీలు తీసుకునే సమయం గురించి తెలుసుకుందాం.

టయోటా కారు మోడల్స్​ను వినియోగదారునికి చేర్చేందుకు పట్టే సమయం:

కారు మోడల్స్​పట్టే సమయం
1టయోటా హైక్రాస్18 నెలల వరకు
2మహీంద్రా థార్17 నెలల వరకు
3టయోటా హైరైడర్15 నెలల వరకు
4మహీంద్రా స్కార్పియో15 నెలల వరకు
5మహీంద్రా ఎక్స్​యూవీ 70011 నెలల వరకు
6కియా కేరెన్స్11 నెలల వరకు
7మారుతి బ్రెజ్జా10 నెలల వరకు
8కియా సోనెట్9 నెలల వరకు
9హ్యుందాయ్ క్రెటా8 నెలల వరకు
10మారుతి గ్రాండ్ విటారా6 నెలల వరకు

మారుతి సుజుకి కారు మోడల్స్​ను వినియోగదారునికి అందిచేందుకు పట్టే సమయం:

మోడల్​పట్టే సమయం
1మారుతి సుజుకి గ్రాండ్ విటారా24-26 వారాలు
2మారుతి సుజుకి ఎక్స్​ఎల్​624-26 వారాలు
3మారుతి సుజుకి సియాజ్8-10 వారాలు
4మారుతి సుజుకి బాలెనో4-6 వారాలు
5మారుతి సుజుకి ఇగ్నిస్వెయిటింగ్​ లేదు

టాటా కంపెనీ కార్లను వినియోగదారునికి అందించేందుకు సంస్థ తీసుకుంటున్న సమయం:

మోడల్​పట్టే సమయం
1టాటా నెక్సాన్ ఏఎమ్​టీ10-14 వారాలు
2టాటా పంచ్ ఏఎమ్​టీ8-10 వారాలు
3టాటా పంచ్ ఎమ్​టీ6-8 వారాలు
4టాటా నెక్సాన్ ఎమ్​టీ8-10 వారాలు
5టాటా సఫారీ6-8 వారాలు
6టాటా హారియర్6-8 వారాలు
7టాటా ఆల్ట్రోజ్4-6 వారాలు
8టాటా టైగర్4-6 వారాలు
9టాాటా టియాగో4-6 వారాలు

మహింద్రా మోడల్​ కార్లను వినియోగదారునికి అందించేందుకు పట్టే సమయం:

మోడల్​ పట్టే సమయం
1మహీంద్రా థార్ ఆర్​డబ్ల్యూడీ74 వారాలు
2మహీంద్రా స్కార్పియో ఎన్65 వారాలు
3మహీంద్రా ఎక్స్​యూవీ70048 వారాలు
4మహీంద్రా స్కార్పియో క్లాసిక్26 వారాలు
5మహీంద్రా ఎక్స్​యూవీ30019 వారాలు
6మహీంద్రా బొలెరో 8 వారాలు
7మహీంద్రా థార్ 4​డబ్ల్యూడీ3-4 వారాలు

టయోటా మోడల్​ కార్లను వినియోగదారునికి చేర్చేందుకు పట్టే సమయం:

మోడల్​ పట్టే సమయం
1టయోటా ఇన్నోవా హైక్రాస్18 నెలలు
2టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్15 నెలలు
3టయోటా గ్లాంజా6 నెలలు
4టయోటా ఇన్నోవా క్రిస్టా4-5 నెలలు
5టయోటా కామ్రీ2-3 నెలలు
6టయోటా వెల్‌ఫైర్2-3 నెలలు
7టయోటా ఫార్చ్యూనర్8 వారాలు

గ్లాన్జా ఎస్​, జీ, వీ ఆటోమేటిక్ వేరియంట్‌లు ఎక్కువగా ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతోంది. సీఎన్​జీ వెర్షన్ మూడు నుంచి నాలుగు నెలల వరకు పడుతోంది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్​, వీ హైబ్రిడ్ వేరియంట్‌లకు ఒక్కొక్కటి పది నుంచి పన్నెండు నెలల వరకు సమయం పడుతోంది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వీ మోడల్​ ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది.

మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లకు పది నెలల వరకు సమయం పడుతోంది. ఇటీవల ప్రారంభించిన సీఎన్​జీ వెర్షన్​కు కూడా పది నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ బేస్ జీఎక్స్​ వేరియంట్ ఐదు నుంచి ఆరు నెలల వరకు నిరీక్షించాల్సి వస్తుండగా.. వీఎక్స్​, జెడ్​ఎక్స్​, జెడ్​ ఎక్స్​(ఓ) పదిహేను నుంచి పద్దెనిమిది నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. 2023 ఇన్నోవా క్రిస్టా డీజిల్ నాలుగు నుంచి ఐదు నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

Last Updated :Mar 15, 2023, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.