ETV Bharat / business

ట్విట్టర్​ డీల్ నుంచి ఎలాన్ మస్క్ ఔట్.. కోర్టుకు వెళ్తామన్న సంస్థ

author img

By

Published : Jul 9, 2022, 6:16 AM IST

Updated : Jul 9, 2022, 6:32 AM IST

elon musk twitter
ఎలాన్ మస్క్​

ELON MUSK TWITTER DEAL: ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. నకిలీ ఖాతాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ట్విట్టర్ ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. మరోవైపు, ఈ నిర్ణయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ పేర్కొంది.

ELON MUSK TWITTER DEAL: టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ప్రముఖ సామాజిక దిగ్గజ సంస్థ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నకిలీ ఖాతాలకు సంబంధించి ట్విట్టర్‌ పూర్తి సమాచారం ఇవ్వలేదని, విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘించిందని, దీంతో ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ట్విట్టర్​ను సొంతం చేసుకునేందుకు మస్క్‌ గతంలో 44 బిలియన్‌ డాలర్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్‌ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్‌ ముందుకు వెళ్లదని గత కొంత కాలంగా ఆయన చెబుతూ వస్తున్నారు. ట్విట్టర్ చెప్పిన దానికంటే స్పామ్‌ ఖాతాలు నాలుగింతలు అధికంగా ఉన్నాయంటున్న ఆయన.. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారం కచ్చితమైనదని భావించే తాను కొనుగోలు ఒప్పందానికి అంగీకరించానని గతంలో పేర్కొన్నారు. ఆ విషయం తేలేవరకు కొనుగోలు ఒప్పందం ముందు వెళ్లదని ఎలాన్‌ మస్క్‌ పలుమార్లు స్పష్టం చేశారు.

మరోవైపు విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి బోర్డు చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు యోచిస్తోందని ట్విట్టర్ ఛైర్మన్‌ బ్రెట్‌ టెయిలో పేర్కొన్నారు. గత ఎప్రిల్‌లో ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు మస్క్‌ 44 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. అయితే స్పామ్‌, నకిలీ ఖాతాల గురించి సరైన సమాచారం ట్విట్టర్ ఇవ్వడం లేదని గత మే నెలలోలో ఈ డీల్‌ను ముందుకు వెళ్లకుండా మస్క్‌ తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి సమాచారం వచ్చేవరకు ఈ ఇది ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. ట్విట్టర్ తమకు పూర్తి సమాచారం ఇవ్వడంలో విఫలమైందని మస్క్‌ తరఫున న్యాయవాదులు యూఎస్‌ సెక్యూరిటీస్‌, ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు లేఖ అందించారు.

ఇవీ చదవండి: స్టాక్​ మార్కెట్లలో లాభాలు రావాలా? ఈ వ్యూహాలను పాటిస్తున్నారా మరి!

త్వరపడండి.. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు తరుణమిదే!

Last Updated :Jul 9, 2022, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.