ETV Bharat / business

TCS vs TDS : టీడీఎస్​, టీసీఎస్ మధ్య తేడా ఏమిటి?​.. టాక్స్​ రిఫండ్​ను ఎలా​ క్లెయిమ్ చేసుకోవాలి?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 4:44 PM IST

Updated : Oct 30, 2023, 5:55 PM IST

TCS vs TDS : ప్రభుత్వం పన్నులు వసూలు చేసేందుకు అనేక పద్ధతలను అనుసరిస్తూ ఉంటుంది. వాటిలో ప్రధానమైనవి టీడీఎస్​, టీసీఎస్​లు. ఇంతకీ టీడీఎస్​, టీసీఎస్​ అంటే ఏమిటి? వాటి మధ్య గల తేడాలు ఏమిటి? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

difference between tds and tcs
TCS vs TDS Difference

TCS vs TDS : టీడీఎస్​ (టాక్స్​ డిడక్షన్​ ఎట్​ సోర్స్​), టీసీఎస్ ​(టాక్స్​ కలెక్డెడ్​ ఎట్​ సోర్స్​).. ఈ రెండు కూడా పన్నుకు సంబంధించిన అంశాలే. అయితే పన్ను సేకరణ పక్రియలో ఇవి వేరు వేరు పాత్రలు పోషిస్తాయి. వీటి ద్వారా వసూలైన మొత్తం ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుంది. ఇంతకీ టీడీఎస్, టీసీఎస్​ అంటే ఏమిటి? వాటి మధ్య ఉన్న భేదాలు ఏమిటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టీడీఎస్ అంటే ఏమిటి?
What Is TDS : కంపెనీ ఒక వ్యక్తికి చేసిన చెల్లింపులపై విధించే పన్నును టీడీఎస్ అంటారు. జీతాలు, అద్దె చెల్లింపులు, బ్రోకరేజీ, కమీషన్, ప్రొఫెషనల్ ఫీజు లాంటి చెల్లింపులపై ఈ టీడీఎస్ వర్తిస్తుంది. నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ చెల్లింపులు జరిపినప్పుడు ఈ టీడీఎస్ వర్తిస్తుంది.

టీసీఎస్ అంటే ఏమిటి?
What Is TCS : కొనుగోలుదారుడికి ఏదైనా వస్తువును అమ్మేటప్పుడు.. అమ్మకందారు వసూలు చేసే పన్నును టీసీఎస్ అంటారు. కలప, స్క్రాప్ లాంటి వస్తువుల అమ్మకాలపై ఈ టీసీఎస్ వర్తిస్తుంది. తయారీ సామగ్రి మినహాయించి ఇతర వస్తువుల అమ్మకాలపై టీసీఎస్ వర్తిస్తుంది.

టీడీఎస్​, టీసీఎస్​ మధ్య తేడాల గురించి తెలుసుకుందాం.

1. ఎవరు పన్నును డిడక్ట్​/ కలెక్ట్​ చేస్తారు

టీడీఎస్​ : చెల్లింపులు చేసేవారు (యజమాని, కొనుగోలుదారుడు, కాంట్రాక్టర్​)

టీసీఎస్​ : ఆదాయాన్ని స్వీకరించేవారు(అమ్మకందారుడు, సర్వీస్​ ప్రొవైడర్​)

2. ఎప్పుడు పన్నును డిడక్ట్​/ కలెక్ట్​ చేస్తారు

టీడీఎస్​ : చెల్లింపులు జరిపేటప్పుడు

టీసీఎస్​ : చెల్లింపులు స్వీకరించినప్పుడు, అమ్మకాలు జరిపినప్పుడు

3. ఏ రకమైన ఆదాయంపై పన్ను డిడక్ట్​/కలెక్ట్ అవుతుంది.

టీడీఎస్​ : వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయంపై (జీతాలు, అద్దె, ప్రొఫెషనల్ ఫీజు, బ్రోకరేజ్​, కమీషన్​)

టీఎసీఎస్​ : నిర్దిష్టమైన వస్తుసేవలపై (కలప, తుక్కు, ఖనిజ ధాతువులు)

4. టాక్స్​ ఎందుకు విధిస్తారు?

టీడీఎస్​ : పన్ను ఎగవేతను నివారించేందుకు, టాక్స్​ను ముందుగానే చెల్లించేలా చూసేందుకు

టీసీఎస్ : పన్ను వసూలును సరళతరం చేసేందుకు

ఆదాయ పన్ను రిఫండ్​ రావాలంటే ఏం చేయాలి?
Income tax refund claim procedure : వ్యక్తులు తాము ఆర్జించిన ఆదాయం, ఇతర ఆర్థిక అంశాల ఆధారంగా, సరైన ఐటీఆర్​ ఫారాన్ని ఎంచుకొని, రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. మీరు కచ్చితంగా రిఫండ్ రావాలని ఆశిస్తూ ఉంటే.. ముందుగా ఫారం 26ఏఎస్​, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్​)లను జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులో మీ ఆదాయ వివరాలతోపాటు, చెల్లించిన టీడీఎస్​, టీసీఎస్​ లాంటి వివరాలు ఉంటాయి. వాస్తవానికి కొన్ని సార్లు మీ దగ్గర వసూలు చేసిన పన్ను వివరాలు.. ఆదాయపన్ను శాఖకు జమ కాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఫారం 26ఏఎస్​లో కూడా అది కనిపించదు.

పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే, ఆదాయ పన్ను చట్టం సెక్షన్​ 87ఏ కింద రూ.12,500 వరకు పన్ను రిబేటు లభిస్తుంది. చాలా మందికి సంబంధించి ఫారం 26ఏఎస్​లో ఇది కనిపించే అవకాశం ఉంది.

ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడం ఎలా?
ITR Filing : ఆదాయ పన్ను రిటర్నులను గడువుకు ముందే దాఖలు చేయాలి. లేదంటే అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గడువు కంటే ముందు రిటర్నులు దాఖలు చేస్తే, ప్రాసెసింగ్​ వేగంగా పూర్తయ్యి, రిఫండ్​ కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.

ITR Filing New or Old Tax Regime : ఇన్​కం టాక్స్​ రిటర్నులు.. పాత, కొత్త విధానాల్లో సమర్పించడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎందులో రిఫండ్​ ఎక్కువ వస్తుందో చూసుకొని, దానిని ఫాలో కావడం మంచిది. అయితే అన్ని సెక్షన్ల కింద మినహాయింపులు క్లెయిం చేసుకోలేనివారు, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

ITR Filing form 16 : ఫారం-16లో లేని మినహాయింపులను మీరు క్లెయిం చేసుకోవాలని అనుకుంటే, దానికి తగిన ఆధారాలను కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెక్షన్​ 80సీ పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వివరాలు అన్నీ మీ పాన్​, ఆధార్​తో అనుసంధానమైన ఉన్న కేవైసీలో ఉంటాయి.

ఉదాహరణకు మీరు ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియం గురించి.. మీ పాన్ ఆధారంగా ఆదాయ పన్ను విభాగానికి తెలిసిపోతుంది. అందువల్ల అనుమతించిన మినహాయింపులను క్లెయిం చేసుకున్న తరువాత వాస్తవంగా ఎంత రిఫండ్​ వస్తుందో చూసుకోండి. అంతకు మించి క్లెయిం చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. ఇబ్బందులకు గురికావల్సి వస్తుందని గుర్తించుకోండి.

How to Become Millionaire With Daily Savings of Rs.500: 15*15*15 ఫార్ములా తెలుసా? కోటీశ్వరులు ఫాలో అయ్యే సూత్రం ఇదే..!

Why Diesel Engines Does Not Use in Bikes? : బైక్​లలో డీజిల్ ఇంజిన్ ఎందుకు అమర్చరో తెలుసా?.. కారణాలు తెలిస్తే..!

Last Updated : Oct 30, 2023, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.