ETV Bharat / business

వాహనదారులకు షాక్​.. పెరిగిన కార్ల ధ‌రలు.. ఎంతంటే?

author img

By

Published : Jul 9, 2022, 7:01 PM IST

Updated : Jul 9, 2022, 7:20 PM IST

tata-motors-hikes-passenger-vehicle-prices
tata-motors-hikes-passenger-vehicle-prices

Tata Motors Car Price Hike: ఆటోమొబైల్​ దిగ్గజం టాటా మోటార్స్.. కార్ల ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు శ‌నివారం ప్ర‌క‌టించింది. ఉత్పత్తి వ్యయం పెరిగిపోవ‌డం వల్ల పెంచ‌క త‌ప్ప‌డం లేద‌ని పేర్కొంది. దీంతో స‌గ‌టున ఆయా కార్ల ధ‌ర‌లు 0.55 శాతం పెరగ‌నున్నాయి. వేరియంట్‌, మోడ‌ల్‌, కారు శ్రేణిని బ‌ట్టి ధ‌ర‌ల్లో తేడా ఉంటుందని వివ‌రించింది.

Tata Motors Car Price Hike: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ పాసింజర్‌ కార్ల ధరలను సవరించింది. పెంపు నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో అన్ని పాసింజర్‌ వాహనాలపై 0.55 శాతం చొప్పున ధరలు పెరగనున్నాయి. వేరియంట్‌, మోడల్‌ బట్టి ధరల పెంపుదలలో తేడా ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ధరల పెంపు నిర్ణయం తీసుకునే ముందు ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని కంపెనీ తెలిపింది. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. ఓ వైపు ఉత్పత్తి వ్యయం పెరిగినా వినియోగదారులపై స్వల్ప భారం పడేలా చూశామని వివరించింది. పంచ్‌, నెక్సాన్‌, హ్యారియర్‌, సఫారీ పేరిట ప్రయాణికుల వాహనాలను టాటా మోటార్స్‌ విక్రయిస్తోంది. మరోవైపు ఇటీవలే తన కమర్షియల్‌ వాహనాల ధరలను 1.5 నుంచి 2.5 శాతం మేర టాటా మోటార్స్ పెంచింది. నెల వ్యవధిలోనే ప్రయాణికుల వాహనాల ధరలను కూడా పెంచడం గమనార్హం.

ఇవీ చదవండి: క్రెడిట్​ స్కోర్​ తగ్గిపోయిందా.. వీటిని ఓసారి చెక్​ చేసుకుంటే సరి.. వెంటనే లోన్​!

టెలికాం రంగంలోకి అదానీ.. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి దరఖాస్తు!

Last Updated :Jul 9, 2022, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.