ETV Bharat / business

లాభాలు తెచ్చిపెట్టే ఎలక్ట్రిక్ ఆటో.. ఫుల్ ఛార్జ్​తో 117కి.మీ జర్నీ.. అతి తక్కువ ధరకే!

author img

By

Published : Jun 21, 2023, 1:07 PM IST

Osm Stream City three wheeler auto
Osm Stream City

Osm Stream City Electric Auto : ఒమేగా సేకీ మొబిలిటీ మరో కొత్త ఎలక్ట్రిక్​ ఆటోను భారత మార్కెట్​లో లాంఛ్​ చేసింది. పర్యావరణానికి అనుకూలంగా ఉంటూనే.. అర్బన్​ ప్యాసెంజర్ అవసరాలను ఇది తీరుస్తుందని కంపెనీ చెబుతోంది. 4 గంటల పాటు ఛార్జింగ్​ చేస్తే గరిష్ఠంగా 117 కి.మీ వరకు మైలేజీ ఇస్తుందని వెల్లడించింది. ఈ ఆటో ఫీచర్స్​, ధర మొదలైన పూర్తి వివరాలు మీ కోసం.

Osm Stream City Electric Auto : ఒమేగా సేకీ మొబిలిటీ మరో కొత్త విద్యుత్​​ వాహనం 'ఓఎస్​ఎం స్ట్రీమ్​ సిటీ'ని భారతమార్కెట్​లో లాంఛ్​ చేసింది. ఈ ఎలక్ట్రిక్​ ఆటో.. ఎకో ఫ్రెండ్లీగా ఉంటూనే, ఆర్బన్​ ప్యాసెంజర్​ అవసరాలకు అనుగుణంగా తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే
OSM Stream City Mileage : ఓఎస్​ఎమ్​ స్ట్రీమ్ సిటీ ఓటీఆర్​ వాహనాన్ని ఫుల్​ ఛార్జింగ్​ చేయడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 80 కి.మీ మైలేజీ వస్తుంది. ఓఎస్​ఎమ్​ స్ట్రీమ్ సిటీ ఆటోను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్​ చేస్తే 117 కి.మీ మైలేజీ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ విద్యుత్​ వాహనంలో లిథియం-ఐయాన్​ బ్యాటరీ ఉంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా ఉంది. కనుక రోజంతా ఈ వాహనాన్ని నడుపుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ఇంటీరియర్​ - సీటింగ్​
OSM Stream City Interior : ఈ ఆటోలో డ్రైవర్​తోపాటు మరో ముగ్గురు ప్యాసెంజర్ల కూర్చోవచ్చు. రూఫ్​ కూడా చాలా సాఫ్ట్​గా ఉండి.. ప్రయాణికులకు రక్షణను కల్పిస్తుందని కంపెనీ వెల్లడించింది.

చాలా సేఫ్​గా.. వేగంగా!
OSM Stream City High Speed : ఈ విద్యుత్​ ఆటో గరిష్ఠంగా గంటకు 48 కి.మీ వేగంతో నడుస్తుంది. రహదారులపై 100 కి.మీ వరకు సాధారణ డ్రైవింగ్ పరిధిని కలిగి ఉంటుంది. 16 శాతం వరకు గ్రేడబిలిటీ కూడా దీనికి ఉంది.

పర్యావరణానికి అనుకూలంగా!
Eco friendly Electric Auto : ఈ విద్యుత్​ త్రిచక్ర వాహనం చాలా పర్యావరణ అనుకూలమైనది అని కంపెనీ చెబుతోంది. తక్కువ కర్బన ఉద్గారాలను, తక్కువ శబ్దాన్ని మాత్రమే ఇది విడుదల చేస్తుందని.. అందువల్ల ఇది పర్యావరణానికి చాలా అనుకూల వాహనమని ఓఎస్​ఎం కంపెనీ అంటోంది.

వేరియంట్స్​
OSM Stream City Electric Auto : ఆ విద్యుత్ ఆటో రెండు వేరియంట్లలో లభిస్తుంది.

  • స్వాపబుల్​ బ్యాటరీతో వస్తున్న స్ట్రీమ్​ సిటీ ఏటీఆర్​ ధర రూ.1.85 లక్షలుగా ఉంది.
  • ఫిక్స్​డ్​ బ్యాటరీతో వస్తున్న స్ట్రీమ్​ సిటీ ధర రూ.3.01 లక్షలు (ఎక్స్​షోరూం ధర)

నాలుగు భిన్నమైన రంగుల్లో
OSM Stream City Color Options : ఓఎస్​ఎం ఆటో నాలుగు భిన్నమైన రంగుల్లో లభిస్తుంది. తెలుపు, నీలం, నలుపు & పసుపు, పసుపు & పచ్చ రంగుల్లో లభిస్తోంది.

5 రెట్లు ఎక్కువ ఉత్పత్తి
విద్యుత్​ వాహనాల ఉత్పత్తిని తాము ఇప్పటికే 5 రెట్లు ఎక్కువగా పెంచామని ఓఎస్​ఎమ్​ వ్యవస్థాపకుడు, ఛైర్మన్​ ఉదయ్​ నారంగ్​ తెలిపారు. 2024 నాటికి కనీసం 10,000 విద్యుత్​ త్రిచక్రవాహనాలను విక్రయించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

"మేము మొదటిగా ఎలక్ట్రిక్​ కార్గో వాహనాలను మార్కెట్​లోకి తెచ్చాం. ఇప్పుడు విద్యుత్​ ప్యాసెంజర్ వాహనాన్ని తీసుకొచ్చాం. విద్యుత్ త్రిచక్ర వాహనాల (ఆటో) రంగంలోకి విస్తరించడానికి మేం అనుసరించిన వ్యూహం ఇది.​"

- ఉదయ్​ నారంగ్​, ఓఎస్​ఎమ్​ ఫౌండర్​​, ఛైర్మన్​.

సన్​ మొబిలిటితో కలిసి
ఒమేగా సేకీ మొబిలిటీ కంపెనీ.. సన్​ మొబిలిటీతో కలిసి స్వాపబుల్​ బ్యాటరీ ఫీచర్​ను తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. దీని వల్ల తమ కస్టమర్లు చాలా సులభంగా త్వరగా బ్యాటరీలు మార్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని వెల్లడించింది.

Osm Stream City three wheelers
ఓఎస్​ఎం స్ట్రీమ్​ సిటీ

OSM Stream City Electric Auto : ప్రస్తుతం ఒమేగా సేకీ మొబిలిటీకి దేశవ్యాప్తంగా 175కి పైగా డీలర్​షిప్​లు ఉన్నాయి. దీనితోపాటు ఓఎస్​ఎమ్​ తమ కస్టమర్లకు రిటైల్ ఫైనాన్స్ సహకారం అందించడానికి వీలుగా.. ఇండియన్​ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఐడీఎఫ్​సీ, ఛత్తీస్​గఢ్​ గ్రామీణ బ్యాంకు, శ్రీరామ్​ ట్రాన్స్​పోర్ట్​లతో ఒప్పందం కుదుర్చుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.