ETV Bharat / business

ఇన్ఫోసిస్‌ క్యూ2 లాభం రూ.6,021 కోట్లు.. గతేడాది కంటే 11 శాతం అధికం

author img

By

Published : Oct 13, 2022, 10:43 PM IST

Infosys Q2 Results : దేశీయ కార్పొరేట్​ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రెండో త్రైమాసికంలో నికర లాభంలో 11 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది.

Infosys
ఇన్ఫోసిస్‌

Infosys Q2 Results : ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రెండో త్రైమాసికంలో నికర లాభంలో 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ.5,241 కోట్ల లాభాన్ని నమోదు చేసినట్లు ప్రకటించిన ఆ సంస్థ.. ఈ ఏడాది రూ.6,021 కోట్ల లాభాన్ని ఆర్జించింది. రూ.9,300 కోట్లతో షేర్ల బైబ్యాక్‌తో పాటు, మధ్యంతర డివిడెండ్‌ కింద రూ.6,940 కోట్లను షేర్‌ హోల్డర్లకు కేటాయించినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

గతేడాదితో పోలిస్తే ఇన్ఫోసిస్‌ ఆదాయం 23.4 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ.29,602 కోట్ల ఆదాయాన్ని గడించిన ఆ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.36,538 కోట్లు ఆర్జించింది. తమ సేవలకు డిమాండ్‌ బలంగా ఉందని ఇన్ఫీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. ఆర్థిక దృక్పథం గురించి ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. క్లయింట్లు తమ సామర్థ్యంపై విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో 15-16 శాతం వృద్ధి నమోదు కావొచ్చని కంపెనీ అంచనా వేసింది. గతంలో 14-16 మధ్య ఉన్న అంచనాలను సవరించింది.

రూ.9,300 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలుచేయాలని ఇన్ఫోసిస్‌ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో షేరును రూ.1850కు మించకుండా కొనుగోలు చేయనున్నారు. బైబ్యాక్‌ ప్రోగ్రాములో ప్రకటించిన మొత్తం.. ప్రస్తుత ఇన్ఫీ షేరు విలువ కంటే 30 శాతం అధికం. గురువారం కంపెనీ షేరు రూ.1419.7 వద్ద ముగిసింది. మధ్యంతర డివిడెండ్‌లో భాగంగా ఒక్కో షేరుకు రూ.16.50 చొప్పున చెల్లించనున్నారు.

ఇవీ చదవండి: భారత్​లో నగదు బదిలీ పథకం అమలు.. ఓ అద్భుతం: ఐఎంఎఫ్​

RBI కొత్త రూల్స్.. క్రెడిట్‌ కార్డ్ బిల్​ కట్టడం లేటైనా ఓకే.. కానీ ఓ షరతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.