ETV Bharat / business

నయా సైబర్​ స్కామ్​ - ఆ నంబర్​కు కాల్​​ చేశారో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడం గ్యారెంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 4:12 PM IST

Updated : Jan 13, 2024, 4:18 PM IST

*401# dial code fraud
Government Advises Never To Dial *401#

Government Advises Never To Dial *401# Code In Telugu : సైబర్ నేరగాళ్లు మరో కొత్త రకం స్కామ్​కు తెరతీశారు. దీనితో ప్రజలు *401# కోడ్​ ఉపయోగించి, ఎవరికీ ఫోన్ చేయకూడదని టెలికాం డిపార్ట్​మెంట్​ (DoT) హెచ్చరిక జారీ చేసింది. ఒక వేళ ఎవరైనా ఈ *401# కోడ్​తో తెలియని ఫోన్ నంబర్​కు కాల్​​ చేస్తే, ఆన్​లైన్ మోసానికి గురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

Government Advises Never To Dial *401# Code : టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొలదీ ఆన్​లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. కానీ సైబర్​ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తుగడలతో, ఆన్​లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలను అరికట్టాలంటే, మనం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.

నమ్మించి మోసం చేస్తారు!
సాంకేతికత పెరిగిన తరువాత, మన పనులన్నీ ఆన్​లైన్​లోనే సులువుగా జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్​, షాపింగ్, మెసేజింగ్ అన్నీ ఆన్​లైన్​లోనే చేసేస్తున్నారు. దీనితో వీరిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఎవరికీ అనుమానం రాకుండా కొత్త రకం మోసానికి తెరతీశారు. వీరు వినియోగదారులను ఎలా మోసం చేస్తారో ఇప్పుడు చూద్దాం.

సైబర్​ నేరగాళ్లు ముందుగా మీకు ఫోన్​ చేస్తారు. తాము కస్టమర్​ కేర్​ నుంచి ఫోన్​ చేస్తున్నామని చెబుతారు. లేదా మీ టెలికాం ఆపరేటర్​ టెక్నికల్ సపోర్ట్ టీమ్ వాళ్లమని చెప్పి, మిమ్మల్ని నమ్మిస్తారు.

మీ సిమ్ కార్డులో ఒక సమస్య ఉందని, దానిని క్లియర్ చేయాలని చెబుతారు. లేదా నెట్​వర్క ప్రోబ్లమ్​ అని లేదా సర్వీస్ క్వాలిటీని చెక్​ చేస్తున్నామని మిమ్మల్ని నమ్మిస్తారు. ప్రోబ్లమ్​ను సాల్వ్ చేయాలంటే, మీ ఫోన్ నుంచి తాము చెప్పిన నంబర్​కు కాల్ చేయమని చెబుతారు. అయితే దానికి ముందు *401# కోడ్​ను ఉపయోగించాలని సూచిస్తారు. మీరు పొరపాటున ఈ కోడ్ ఉపయోగించి సదరు నంబర్​కు డయల్ చేశారో, ఇక మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు అంతా ఖాళీ అయిపోతుంది.

ఎలా అంటే?
మీరు మీ ఫోన్​లో *401# కోడ్​ను ఉపయోగించి, మీకు తెలియని ఫోన్​ నంబర్​కు కాల్​ చేస్తే, ఇక అప్పటి నుంచి మీకు వచ్చే కాల్స్​, ఓటీపీలు అన్నీ సదరు నంబర్​కు (ఫార్వర్డ్ అవుతాయి) వెళ్లిపోతాయి. సైబర్ నేరగాళ్లు వాటిని ఉపయోగించి, మీ బ్యాంక్​ ఖాతాలోని డబ్బు మొత్తాన్ని దోచుకుంటారు.

ఆన్​లైన్​ షాపింగ్ చేశారా?
నేడు ప్రతి ఒక్కరూ ఆన్​లైన్ షాపింగ్ చేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కస్టమర్​కు నేరుగా ఫోన్ చేసి, మీకు డెలివరీ వచ్చిందని చెబుతారు. మీ ప్యాకేజీని డెలివరీ బాయ్​ ఇస్తాడని, అతనిని కాంటాక్ట్ చేయాలంటే, ముందుగా *401#కోడ్​ను ఎంటర్​ చేసి, తరువాత అతని ఫోన్ నంబర్​ ఎంటర్​ చేయాలని చెబుతారు. పొరపాటున మీరు సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేస్తే, ఇక అంతే సంగతులు. మీ బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది.

అప్రమత్తంగా ఉండాలి
నేడు ఇలాంటి సైబర్​ మోసాలు చాలానే జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి, వారు చెప్పిన నంబర్​కు కాల్ చేయమని అడిగితే, వెంటనే దానిని తిరస్కరించండి. పార్సిల్స్​ విషయంలో డెలివరీ బాయ్స్​ మీకు కాల్​ చేస్తారు. మిమ్మల్ని తిరిగి కాల్ చేయమని వారు అడగరు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.

బెస్ట్ కో-బ్రాండెడ్​ క్రెడిట్ కార్డ్​ ఎంచుకోవాలా? టాప్​-7 టిప్స్​ మీ కోసమే!

ధూమపానం, మద్యపానం జీవిత బీమా ప్రీమియంను ప్రభావితం చేస్తాయా?

Last Updated :Jan 13, 2024, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.