ETV Bharat / business

ధూమపానం, మద్యపానం జీవిత బీమా ప్రీమియంను ప్రభావితం చేస్తాయా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 12:57 PM IST

How Does Smoking And Drinking Impact Life Insurance Premium In Telugu : మీరు జీవిత బీమా తీసుకోవాలని అనుకుంటున్నారా? మీకు ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉన్నాయా? అయితే ఇది మీ కోసమే. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How Does Drinking Impact Life Insurance Premium
How Does Smoking Impact Life Insurance Premium

How Does Smoking And Drinking Impact Life Insurance Premium : జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ జీవిత బీమా తప్పనిసరి. ఒక వేళ దురదృష్టకర పరిస్థితుల్లో యజమాని మరణిస్తే, అతని కుటుంబ సభ్యులకు ఇది ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. అయితే బీమా కంపెనీలు ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ పాలసీని ఇచ్చే ముందు అనేక అంశాలను పరిశీలిస్తాయి. ముఖ్యంగా మీ ఆరోగ్య పరిస్థితుల గురించి, ధూమపానం, మద్యపానం, గుట్కాలు తినడం లాంటి అలవాట్ల గురించి కచ్చితంగా ఆరా తీస్తాయి. ఒక వేళ మీకు సదరు చెడు అలవాట్లు ఉంటే, మిమ్మల్ని హై-రిస్క్​ ఉన్న వ్యక్తులుగా పరిగణిస్తాయి. కనుక మీ నుంచి అధిక ప్రీమియంను వసూలు చేస్తాయి. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

ధూమపానం
బీమా కంపెనీలు సిగరెట్లు, బీడీలు, చుట్టలు, Vape లేదా ఎలక్ట్రానిక్ సిగరెట్లను తాగేవాళ్లను స్మోకింగ్‌ అలవాటు ఉన్న వ్యక్తులుగా పరిగణిస్తాయి. గుట్కా, పాన్‌ మసాలా, నికోటిన్‌ పాచెస్‌, నికోటిన్‌ చూయింగ్‌ గమ్స్‌, గంజాయి ఉపయోగించే వ్యక్తులను కూడా హై-రిస్క్ కేటగిరీలోకి వచ్చేవారిగా గుర్తిస్తాయి. అప్పుడప్పుడు ధూమపానం చేసేవారు, రోజువారీ అలవాటు ఉన్నవారు అనే తేడా లేకుండా, అందరినీ ఒకే విధంగా బీమా సంస్థలు పరిగణిస్తాయి.

ఇన్సూరెన్స్ కంపెనీలు సాధారణంగా కొన్ని ప్రశ్నలు వేస్తుంటాయి. అవి :

  • మీరు పొగాకు/ నికోటిన్‌ ఉత్పత్తులను తీసుకుంటారా?
  • మీరు ధూమపానం (పొగ తాగడం) చేస్తారా?
  • మీరు గత 5 ఏళ్లలో పొగాకు ఉత్పత్తులను ఉపయోగించారా?
  • మీరు ఎప్పుడైనా పొగాకు ఉత్పత్తులను వినియోగించారా?

ఈ ప్రశ్నలకు మీ సమాధానం 'అవును' అయితే, మీరు ధూమపానం చేసేవారుగా ఇన్సూరెన్స్ కంపెనీలు పరిగణిస్తాయి. ఒక వేళ బీమా కంపెనీ మిమ్మల్ని స్మోకర్​గా ట్యాగ్‌ చేసినట్లయితే, మీరు హై-రిస్క్‌ కేటగిరీలో ఉన్నట్లే లెక్క. అందువల్ల సాధారణ వ్యక్తుల కంటే, మీ నుంచి ఎక్కువ మొత్తంలో ప్రీమియం వసూలు చేస్తాయి.

అధిక ప్రీమియం
బీమా సంస్థలు ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్​ పాలసీని ఇచ్చే ముందు కచ్చితంగా అతని/ ఆమె రిస్క్ ప్రొఫైల్​ను నిశితంగా పరిశీలిస్తాయి. ధూమపానం, మద్యపానం, గుట్కాలు లాంటి చెడు అలవాట్లు ఉన్నవారి జీవిత కాలం చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపణ అయ్యింది. ముఖ్యంగా ధూమపానం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, శ్వాసకోశ సమస్యలు సహా, అనేక రకాల రోగాలు తలెత్తుతాయి. దీని వల్ల వారి జీవితకాలం గణనీయంగా తగ్గిపోతుంది. అందుకే జీవిత బీమా సంస్థలు, ధూమపానం అలవాటు లేనివారితో పోలిస్తే, ఈ అలవాటు ఉన్నవారి నుంచి 50-80% ఎక్కువ ప్రీమియంను వసూలు చేస్తాయి. అయితే ఈ ప్రీమియం అనేది ఆయా కంపెనీలను అనుసరించి మారుతూ ఉంటుంది.

ధూమపానం గురించి చెప్పకపోతే?
లైఫ్ ఇన్సూరెన్స్​ పాలసీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు, ధూమపానం అలవాటు గురించి నిజాయితీగా సమాచారం అందించాలి. బీమా ప్రీమియం ఎక్కువ అవుతుందనే కారణంతో మీ అలవాటును దాచకూడదు. ఒకవేళ నిజాన్ని దాస్తే, భవిష్యత్తులో పాలసీ క్లెయిమ్​ను తిరస్కరించే ప్రమాదం ఉంటుంది. లేదా పూర్తిగా పాలసీనే రద్దు చేసే అవకాశం ఉంటుంది.

బీమా పాలసీని ధ్రువీకరించే ప్రక్రియలో భాగంగా ఇన్సూరెన్స్​ కంపెనీ గత 12 నెలల్లో మీరు ధూమపానం చేశారా? లేదా? అనేది చూస్తుంది. ఇందుకోసం మెడికల్ టెస్ట్​లు కూడా నిర్వహిస్తుంది. వైద్య పరీక్షల ద్వారా నికోటిన్​ను ఉపయోగించారా? లేదా? అనేది చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

లైఫ్ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకున్న 3 ఏళ్లలోపు డెత్‌ క్లెయిమ్​ చేస్తే, బీమా కంపెనీలు కచ్చితంగా మెడికల్ ఫిట్​నెస్​ సర్టిఫికెట్​ లేదా పోర్ట్​మార్టం రిపోర్టులను పరిశీలిస్తాయి. ఒకవేళ వాటిలో ధూమపానం చేసినట్లు తేలితే, మీ క్లెయిమ్​ను బీమా సంస్థలు తిరస్కరించే అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు ఉన్న చెడు అలవాట్లు గురించి, మీ సంస్థకు ముందే చెప్పడం మంచిది.

చెడు అలవాట్లు మానేస్తే?
ఇన్సూరెన్స్ కంపెనీలు స్మోకింగ్ అలవాటు ఉన్నవారి నుంచి అధిక ప్రీమియంను వసూలు చేస్తాయి. ఒక వేళ మీరు మధ్యలో చెడు అలవాట్లను మానేస్తే, బీమా సంస్థలు వారి ప్రీమియంను తగ్గించే అవకాశం ఉంది. సాధారణంగా 1-5 సంవత్సరాల వరకు స్మోకింగ్‌ చేయకుండా ఉంటే తప్ప, బీమా సంస్థలు ధూమపాన రహితస్థితిని అంగీకరించవు. అందువల్ల ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తి విజయవంతంగా దానిని మానేసి, పొగాకు రహిత జీవనశైలిని కొనసాగించిన తర్వాత, లైఫ్ ఇన్సూరెన్స్​ ప్రీమియానికి సంబంధించి రీవాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, పాలసీదారుడి వయస్సు, ఇతర ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, బీమా కంపెనీలు పాలసీ ప్రీమియంను తగ్గిస్తుంటాయి. ఇదే కాదు, జీవిత బీమా రకం, బీమా మొత్తం, వయస్సు, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగానూ బీమా ప్రీమియంను నిర్ణయిస్తాయి.

మంచి స్కూటర్ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-10 మోడల్స్ ఇవే!

ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? భార్యాభర్తలు పాటించాల్సిన టాప్​-9 ఫైనాన్సియల్​ టిప్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.