ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..

author img

By

Published : Dec 23, 2022, 11:37 AM IST

gold rate today
బంగారం, వెండి ధరలు

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.550 మేర తగ్గి ప్రస్తుతం రూ.55,930 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.863 తగ్గింది. ప్రస్తుం కేజీ వెండి ధర రూ.69,700 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.55,930గా ఉంది. కిలో వెండి ధర రూ.69,700 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,930వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,700గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,930గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,700వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,930 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,700గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,795.50 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.67 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,93,536 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,93,463
ఇథీరియంరూ.1,01,313
టెథర్​రూ.82.79
బైనాన్స్​ కాయిన్​రూ.20,416
యూఎస్​డీ కాయిన్రూ.82.86

స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 471 పాయింట్ల నష్టంతో 60,355 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 141 పాయింట్లు నష్టపోయి 17,985 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఎన్‌టీపీసీ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, మారుతీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ:
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.81 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.