ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తాజా రేట్లు ఇవే!

author img

By

Published : Mar 24, 2023, 12:38 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rates today
gold rates today

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.1,760 పెరిగి.. ప్రస్తుతం రూ.61,110గా ఉంది. కిలో వెండి ధర రూ.1,660 పెరిగి.. ప్రస్తుతం రూ.71,460 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.61,110వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,460 రూపాయలుగా ఉంది.

Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ. 61,110గా ఉంది. కిలో వెండి ధర రూ.71,460 వద్ద కొనసాగుతోంది.

Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,110 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.71,460గా ఉంది.

Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,110గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,460 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,986 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.99 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.23,16,406 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.23,16,406
ఇథీరియంరూ.1,48,608
టెథర్​రూ. 82.30
బైనాన్స్​ కాయిన్​రూ.26,757
యూఎస్​డీ కాయిన్రూ.82.17

నష్టాల్లో దేశీయ స్టాక్​ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య.. శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 123 పాయింట్లు నష్టపోయి 57,802 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు పడిపోయి.. 17,015 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్​ ఫిన్​సెర్వ్, బజాజ్​ ఫైనాన్స్​, మహీంద్రా అండ్​ మహీంద్రా, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, టైటన్, ఏసియన్​ పేయింట్స్, నెస్లే, టాటా స్టీల్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్​, టీసీఎస్​, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్ టెక్నాలజీస్, ఎల్​&టీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.