ETV Bharat / business

Gold Rate Today 8th August 2023 : దిగివస్తున్న బంగారం, వెండి​ ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Aug 8, 2023, 11:08 AM IST

Updated : Aug 8, 2023, 12:02 PM IST

Gold Rate Today 8th August 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 8th August 2023
Gold Rate Today 8th August 2023

Gold Rate Today 8th August 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు​ మరింతగా దిగివస్తున్నాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,245గా ఉండగా.. మంగళవారం రూ.83 తగ్గి రూ.61,162కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.74,180గా ఉండగా.. రూ.700 తగ్గి మంగళవారం రూ.73,420కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad 8th August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,162గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,420గా ఉంది.
  • Gold Price in Vijayawada 8th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,162గా ఉంది. కిలో వెండి ధర రూ.73,420కు చేరుకుంది.
  • Gold Price in Vishakhapatnam 8th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,162గా ఉంది. కిలో వెండి ధర రూ.73,420గా ఉంది.
  • Gold Price in Proddatur 8th August 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,162గా ఉంది. కిలో వెండి ధర రూ.73,420కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price Today 8th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేటు స్వల్పంగా తగ్గింది. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1938 డాలర్లుగా ఉండగా.. మంగళవారం 4 డాలర్లు మేరకు తగ్గి 1934 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.17 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news Today 8th August 2023 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మిశ్రమంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,14,942 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,14,942
ఇథీరియంరూ.1,51,384
టెథర్రూ.82.69
బైనాన్స్ కాయిన్రూ.20,050
యూఎస్​డీ కాయిన్రూ.82.79

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..
Stock market Today 8th August 2023 : మంగళవారం దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. కానీ ప్రస్తుతం కాస్త కోలుకుని స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష, యూఎస్​ ఇన్​ఫ్లేషన్​ డేటా వివరాలు రానున్న నేపథ్యంలో పెట్టబడిదారులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 31 పాయింట్లు లాభపడి 65,985 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 10 పాయింట్లు వృద్ధి చెంది 19,607 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : యాక్సిస్​ బ్యాంకు, టెక్​ మహీంద్రా, ఎస్​బీఐ, విప్రో, మారుతి సుజుకి, టైటాన్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : పవర్​గ్రిడ్​, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, టాటా స్టీల్​, ఐటీసీ

రూపాయి విలువ!
Rupee Open Today 8th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 6 పైసలు తగ్గి రూ.82.81 వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices Today 8th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Price Today 8th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.18 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 85.49 డాలర్లుగా ఉంది.

Last Updated :Aug 8, 2023, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.