ETV Bharat / business

Gold Rate Today 21th September 2023 : తగ్గిన బంగారం ధర.. కాస్త పెరిగిన వెండి.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 9:55 AM IST

gold-rate-today-21th-september-2023-stock-market-today-and-cryptocurrency-trading-today-petrol-and-deiseal-prices-today
ఈ రోజు బంగారం వెండి ధరలు

Gold Rate Today 21th September 2023 : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి కాస్త పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 21th September 2023 : దేశంలో పసిడి ధర కాస్త తగ్గింది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,242 ఉండగా.. గురువారం రూ.192 తగ్గి రూ.61,050కి చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.73,947 ఉండగా.. గురువారం రూ.100 పెరిగి రూ.74,047కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 21th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,050గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,047గా ఉంది.
  • Gold Price In Vijayawada 21th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,050గా ఉంది. కిలో వెండి ధర రూ.74,047కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 21th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,050గా ఉంది. కిలో వెండి ధర రూ.74,047గా ఉంది.
  • Gold Price In Proddatur 21th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,050గా ఉంది. కిలో వెండి ధర రూ.74,047కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 21th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1932 డాలర్లుగా ఉండగా.. గురువారం 1928 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.15 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 21th September 2023 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,41,899 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,41,899
ఇథీరియంరూ.1,34,501
టెథర్రూ.83.3
బైనాన్స్ కాయిన్రూ.17,815
యూఎస్​డీ కాయిన్​ రూ.83.6

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు
Stock Market Today 21th September 2023 : గురువారం కూడా దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతలకు తోడు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటు నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడమే దీనికి కారణం. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 796 పాయింట్లు నష్టపోయి 67080 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 232 పాయింట్లు కోల్పోయి 19,901 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : పవర్​గ్రిడ్​, సన్​ఫార్మా, ఏషియన్​ పెయింట్స్​.
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్​ సిమెంట్​, మారుతీ, టాటా స్టీల్​.

రూపాయి విలువ!
Rupee Open 21th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు తగ్గి.. రూ.83.16 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 21th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 21th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.99 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 93.41 డాలర్లుగా ఉంది.

ATM Withdraw Issues : ఏటీఎంలో డబ్బులు రాలేదా..? బ్యాంకులు రోజుకు రూ.100 ఇవ్వాల్సిందే..!

Rupee Internationalisation RBI : రూపాయి అంతర్జాతీయీకరణ సాధ్యమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.