ETV Bharat / business

జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతం.. పెరిగిందా? తగ్గిందా?

author img

By

Published : May 31, 2022, 6:56 PM IST

GDP grows 4.1 pc in Jan-Mar qtr; 8.7 pc in FY22
GDP grows 4.1 pc in Jan-Mar qtr; 8.7 pc in FY22

GDP Growth Rate: 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతంగా నమోదైంది. ఈ మేరకు అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 4.1 శాతం.

GDP Growth Rate: 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు 8.9 శాతంగా అంచనా వేయగా 8.7 శాతం మాత్రమే నమోదైంది. మూడో త్రైమాసికంలో 5.4 శాతంగా ఉన్న వృద్ధిరేటు నాలుగో త్రైమాసికంలో 4.1శాతానికే పరిమితమైంది. అయితే 2020-21 జనవరి మార్చి మధ్యకాలంలోనూ 2.5 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైనట్లు జాతీయ గణాంకాల కార్యాలయం- ఎన్​ఎస్​ఓ ఒక ప్రకటనలో తెలిపింది.
2020-21లో వృద్ధిరేటు 6.6 శాతం క్షీణించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఎన్​ఎస్​ఓ రెండో ముందస్తు అంచనాల్లో వృద్ధిరేటును 8.9 శాతంగా పేర్కొంది. ఈ ఏడాది మొదటి మూడునెలల్లో చైనా వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదైంది.

ఇవీ చూడండి: 'దేశంలో పెరిగిన నకిలీ నోట్లు'.. ప్రతిపక్షాలకు అస్త్రంగా ఆర్‌బీఐ నివేదిక

క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక ప్రకటన.. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్​తో కలిసి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.