ETV Bharat / business

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా ? అయితే డబ్బులను నష్టపోతున్నట్లే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 11:14 AM IST

Disadvantages Of Fixed Deposits In Telugu
Disadvantages Of Fixed Deposits In Telugu

Disadvantages Of Fixed Deposits In Telugu : బ్యాంకులు అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయని మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఎఫ్‌డీ చేయడం వల్ల స్థిరమైన ఆదాయం పొందుతున్నప్పటికీ, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Disadvantages Of Fixed Deposits In Telugu : చాలా మంది తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బును సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ఇందుకోసం ఎక్కువ మంది బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేయడానికి మొగ్గు చూపుతారు. దీని వల్ల స్థిరమైన రాబడి వస్తుంది. మ్యూచువ‌ల్ ఫండ్లు, ఈటీఎఫ్‌లు, బాండ్లు, షేర్లు, యాన్యుటీలు, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్ ఇలా పెట్టుబ‌డులు పెట్టడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా కూడా, చాలా మంది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కే (Fixed Deposit) అధిక ప్రాధాన్య‌ం ఇస్తుంటారు. బ్యాంకులో డ‌బ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే స్థిర రాబ‌డితో పాటు డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంద‌నేది ఖాతాదారుల నమ్మ‌కం. కానీ, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో కూడా కొన్ని రిస్క్‌లు ఉన్నాయని.. డబ్బులను డిపాజిట్ చేసే ముందు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల కలిగే ఐదు నష్టాల గురించి తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అవి ఏంటంటే

ట్యాక్స్‌తో వడ్డీ రేటులో కోత : ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎదురయ్యే అతిపెద్ద నష్టం ఏంటంటే.. పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ తక్కువ. ఉదాహరణకు బ్యాంకులు మీకు 7 శాతం వడ్డీని ఇస్తున్నాయనుకుంటే, అది పోస్ట్ ట్యాక్స్ తర్వాత 5 శాతానికే పరిమితమవుతుంది. చాలా మంది ఖాతాదారులకు పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ 5 శాతం వడ్డీతో అందుతాయి.

రాబడి తగ్గిపోతుంది : బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే వ‌చ్చే వ‌డ్డీ రేటు కంటే ద్ర‌వ్యోల్బ‌ణ రేటు ఎక్కువ‌గా ఉంటే, మ‌నం రిస్క్ తీసుకున్న‌ట్లే అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు మ‌నం రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత టూర్‌కి వెళ్లాల‌ని ప్లాన్ చేసి అందుకు కావాల్సిన మొత్తం రూ. 2 ల‌క్ష‌ల‌ను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామ‌ని అనుకుందాం. బ్యాంకు రెండు సంవ‌త్స‌రాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 5.50 శాతం వ‌డ్డీ ఇస్తుంద‌నుకుంటే, మెచ్యూరిటీ పూర్త‌య్యే నాటికి వ‌చ్చే మొత్తం దాదాపు రూ.2,22,200. ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణ రేటును 6 శాతంగా అంచ‌నా వేస్తే 2 సంవ‌త్స‌రాల త‌ర్వాత టూర్‌కి వెళ్లేందుకు దాదాపు రూ.2,25,300 అవ‌స‌ర‌మ‌వుతుంది. అంటే రూ.3,100 అద‌నంగా కావాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ముందు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌ప్ప‌కుండా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి.

3.ట్యాక్స్ సేవింగ్స్‌కు సరైనది కాదు : ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ట్యాక్స్ సేవింగ్స్ కోసం చాలా మంది 5 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడుతుంటారు. సెక్షన్ 80 సి కింద ట్యాక్స్ డిడక్షన్ లిమిట్ రూ. 1.5 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి వచ్చే రాబడి ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి, ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఎఫ్‌డీ చేయడం అంత మంచి ఎంపిక కాదని చెప్పవచ్చు. ముఖ్యంగా సాలరీ అందుకునే వారు, ఇతర వేతన జీవులు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కాకుండా పీపీఎఫ్, వీపీఎఫ్, ఎన్‌పీఎస్ వంటి ఇతర ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఇచ్చే పథకాలలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

పర్ఫెక్ట్​ క్రెడిట్​ స్కోర్ ఉండాలా?- అయితే ఈ తప్పులు చేయొద్దు!​

రూ.5 లక్షల వరకే ఇన్సూరెన్స్ భద్రత : కొన్ని కారణాల వల్ల బ్యాంకులు దివాళా తీస్తాయి. ఇలాంటి ఘటనలు చాలా అరుదు. అయినా వీటిని మనం చూస్తుంటాం. మనం బ్యాంకులో ఎంత మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినా సరే ఇలాంటి సందర్భాల్లో రూ.5 లక్షల వరకే ఇన్సూరెన్స్ వస్తుంది. కాబ‌ట్టి సాధ్య‌మైనంత వ‌ర‌కు డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్ (డిఐసీజీసీ) కింద‌కి వ‌చ్చే బ్యాంకుల‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌డానికి ప్రయత్నించండి. ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసి రిస్క్ తీసుకోవద్దు.

5.దీర్ఘకాలంలో సంపద పెరిగే అవకాశం తక్కువ : బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్లు లాక్ అయ్యి ఉంటాయి. డిపాజిట్ చేసిన‌ప్పుడు ఉన్న వ‌డ్డీ రేటు మెచ్యూరిటీ వ‌ర‌కు కొన‌సాగుతుంది. కాబ‌ట్టి, త‌క్కువ వ‌డ్డీ రేటు వ‌ద్ద డిపాజిట్ చేస్తే మీ డిపాజిట్లు త‌క్కువ వ‌డ్డీ రేటు వ‌ద్దే లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో ఎక్కువ సంపద వస్తుందని అనుకుంటే పొరపాటే.

Note : ఈ స్టోరీ పాఠకుల అవగాహన కోసం మాత్రమే. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేసేవారు, మూచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు నిపుణుల సలహాలు తీసుకుని పూర్తి వివరాలు తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలి. గమనించగలరు..

పిల్లల బంగారు భవిష్యత్ కోసం బెస్ట్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​ ఇదే!

2024లో లాంఛ్ కానున్న టాప్-3 SUV కార్స్ ఇవే! ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.