ETV Bharat / business

7th Pay Commission Central Govt Employees DA Hike : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ అంతనా..?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 11:18 AM IST

7th Pay Commission Govt Employees DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వీరికి సూపర్ బొనాంజా అందించబోతోంది..! వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. ఉద్యోగులకు డీఏ భారీగానే పెరగబోతున్నట్టు సమాచారం. ఈ పెంపు కూడా ఈ నెలలోనే ఉండనుంది. మరి, ఇంతకీ ఎంత పెంచుతున్నారో తెలుసా?

DA Hike For Central Govt Employees
7th Pay Commission Central Govt Employees DA Hike

Central Government Employees DA Hike: కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు DA, పెన్షనర్లకు DR పెంచబోతోంది. ఈ పెంపు ఈ నెలలో ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ 27న కేంద్ర కేబినెట్ సమావేశం ఉండనుందని, ఆ మీటింగ్​లో DA పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

ఎంత పెంచుతారు..?

How Much DA Hike For Central Govt Employees : ఈసారి కూడా డీఏ పెంపు 4 శాతంగా ఉండొచ్చని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతం ఉండగా.. మరో 4 శాతం పెరిగితే 46 శాతానికి డీఏ పెరుగుతుంది. అయితే.. మరికొన్ని నివేదికల ప్రకారం చూస్తే.. డియర్‌నెస్ అలవెన్స్ 3 శాతానికి పరిమితం కావొచ్చని తెలుస్తోంది.

ఏఐసీపీఐ ఇండెక్స్(AICPI Index) ప్రకారం చూస్తే.. డియర్‌నెస్ అలవెన్స్ అనేది 46.24 శాతానికి చేరొచ్చు. జూన్ నెలలో ఏఐసీపీఐ ఇండెక్స్ 136.4 పాయింట్ల వద్ద ఉంది. అంటే దీని ప్రకారం చూస్తే.. డీఏ అనేది 46.24 శాతానికి చేరనుంది. కానీ ప్రభుత్వం 46 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని అంచనా.

7th Pay Commission Report 2023 : ఉద్యోగులకు డీఏ.. పెరిగేది ఎంత..? అమలు ఎప్పట్నుంచి..?

7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం చూస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ అనేది రూ.18 వేల నుంచి రూ. 56,900 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ బేసిక్ శాలరీ ఆధారంగా ఉద్యోగులకు వేతనాలు ఎంత వరకు పెరిగే ఛాన్స్ ఉందో మనం ఒకసారి తెలుసుకుందాం.

  • డీఏ 4 శాతం పెరిగితే.. ఉద్యోగులు అందుకునే మొత్తం ఇలా ఉంటుంది.
  • కనీస వేతనం 18 వేల రూపాయలుగా ఉన్నవారికి.. DA రూ.720 మేర పెరిగే ఛాన్స్ ఉంది. అంటే.. ఏడాదికి రూ. 8,640 వరకు అందుకుంటారు.
  • బేసిక్ శాలరీ రూ. 56,900 ఉన్నవారు.. నెలకు 2,276 పొందుతారు. సంవత్సరానికి 27,312 రూపాయలు అందుకుంటారు.
  • అంటే.. అధిక మూల వేతనం కలిగిన వారికి డీఏ పెంపు కూడా ఎక్కువగా ఉంటుంది.
  • కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రెండు సార్లు డీఏ పెంచుతుంది.
  • జనవరి నుంచి జూన్, అలాగే జూలై నుంచి డిసెంబర్ నాటికి డీఏ పెంపు ఉంటుంది. దీని వల్ల వేతనాలు పైకి చేరుతాయి.

డీఏ పెంపు ఎలా లెక్కిస్తారంటే?
How to calculate DA increase?: దేశంలో ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే డీఏ మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా ఆర్‌బీఐ కంఫర్ట్ జోన్ 2నుంచి 6 శాతం కంటే ఎక్కువగానే ఉంది. డియర్​నెస్​ అలవెన్సు(DA)ను పెంచే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ రూపొందించిన తరువాత కేంద్ర మంత్రి వర్గం దీనిని ఆమోదించే అవకాశం ఉందని సమాచారం.

Good News: గుడ్​న్యూస్​.. డీఏ మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

జూన్ 2023 నాటి తాజా ఇండస్ట్రియల్ వర్కర్స్ కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ప్రకారం, జులై నెలలో ద్రవ్యోల్బణం 3శాతానికి పైనే పెరిగింది. దీని ప్రకారం డీఏను 3 శాతం పెంచే ఛాన్స్​ ఉంది. ఇక జులై, 2023 నుంచి పెంచిన డీఏ అమలులోకి రానుంది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్​కు ఈ డీఏ పెంపు ఉపశమనం కలిగించే ఛాన్స్​ ఉంది. పెరుగుతున్న ఖర్చుల ప్రభావం ఉద్యోగులు, పెన్షనర్లపై పడకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం డీఏను అందిస్తుంది.

DA Hike Effect on Stock Markets: మరొకవైపు డీఏ(DA) పెంపు స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. స్టాక్ మార్కెట్​లో పెట్టుబడులు పెట్టే వారిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. డీఏ పెరుగుదల కారణంగా వారి జీతం పెరగడం వలన వారు మరింత పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది స్టాక్ మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవ్వడానికి తోడ్పడుతుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. 4 శాతం డీఏ పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.