ETV Bharat / business

ఆధార్​ కార్డ్​లోని మీ పాత ఫొటోను మార్చాలా? సింపుల్​గా ఛేంజ్​ చేసేయండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 1:14 PM IST

Aadhar Card Photo Change Process In Telugu : నేడు ప్రభుత్వ పథకాల లబ్థి చేకూరాలన్నా, మరే ఇతర సేవలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి అయిపోయింది. అందుకే దీనిలోని వివరాలను ఎప్పటికప్పుడు అప్​డేట్ చేసుకోవడం మంచిది. అందుకే ఈ ఆర్టికల్​లో ఆధార్​ కార్డ్​లోని ఫొటోను, బయోమెట్రిక్స్​ను ఎలా సింపుల్​గా మార్చుకోవాలో తెలుసుకుందాం.

Aadhar Card Photo update Process
Aadhar Card Photo Change Process in 2024

Aadhar Card Photo Change Process : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIADI) భారత పౌరులకు అందించే గుర్తింపు కార్డే ఆధార్​. ఇది అడ్రస్ ప్రూఫ్​గానూ ఉపయోగపడుతుంది. ప్రస్తుత కాలంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలు పొందాలంటే ఇది తప్పనిసరి అయిపోయింది. అందుకే దీనిలోని ఫొటో, అడ్రస్​, మొబైల్ నంబర్లను ఎప్పటికప్పుడు అప్​డేట్ చేస్తూ ఉండాలి. అయితే కొన్నిసార్లు ఆధార్​ కార్డులోని ఫొటో బాగా లేకపోవడమో, చిరునామా తప్పుగా ఉండడమో, లేదా పుట్టిన తేదీ సరిగ్గా లేకపోవడమో జరుగుతుంది. అప్పుడు వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇదేమంత కష్టమైన పనికాదు. ఆధార్ వివరాలను చాలా సులువుగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Steps To Change Aadhar Card
ఆధార్​ కార్డులోని మీ ఫొటోను నేరుగా ఆన్​లైన్​లో మార్చుకోవడానికి వీలుపడదు. అందువల్ల సమీపంలోని ఆధార్ సెంటర్​కు వెళ్లాలి. అక్కడ రూ.100 రుసుము చెల్లిస్తే, సింపుల్​గా మీ ఫొటోను, బయోమెట్రిక్స్​ను వారు అప్​డేట్ చేస్తారు. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే,

  • ముందుగా మీ దగ్గర్లోని ఆధార్ పర్మినెంట్​ ఎన్​రోల్​మెంట్​ సెంటర్​కు వెళ్లాలి.​
  • ఫొటో మార్చడానికి కావాల్సిన దరఖాస్తును ఆన్​లైన్​లో సమర్పించాలి. లేదా
  • ఆధార్​ సెంటర్​లో అప్లికేషన్​ ఫారమ్​ తీసుకుని, దానిలో మీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  • ఆధార్ సెంటర్​వారికి రూ.100 రుసుము చెల్లించాలి.
  • ఆధార్ సెంటర్​వారు మీ ఫొటోను తీసుకుని అప్​డేట్ చేస్తారు.
  • మీ బయోమెట్రిక్​ వివరాలను కూడా ఆధార్ సెంటర్​ వాళ్లే అప్​డేట్ చేస్తారు.

అప్​డేటెడ్​ ఆధార్ కార్డ్​ను డౌన్​లోడ్ చేసుకోండిలా!

  • ఆధార్ సెంటర్​కు వెళ్లి, మీ ఫొటో, బయోమెట్రిక్స్​ అప్​డేట్​ చేసుకున్న తరువాత, UIDAI అధికారిక పోర్టల్​లోకి లాగిన్ కావాలి.
  • హోమ్ పేజ్​లోని My Aadhar సెక్షన్​లోకి వెళ్లాలి.
  • Download Aadharపై క్లిక్ చేయాలి. తరువాత,
  • ఆధార్ నంబర్​ లేదా ఎన్​రోల్​మెంట్ ఐడీ నమోదు చేయాలి.
  • అక్కడ ఉన్న క్యాప్చాను కూడా ఎంటర్​ చేయాలి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్​ మొబైల్ నంబర్​కు ఒక ఓటీపీ వస్తుంది.
  • ఈ ఓటీపీని నమోదు చేసిన వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్​ అవుతుంది. తరువాత,
  • మీ లేటెస్ట్ ఈ-ఆధార్​ కార్డ్​ కనిపిస్తుంది. దానిని సింపుల్​గా డౌన్​లోడ్​ చేసుకోవాలి.

ఈ ఆధార్​ కార్డుకు పాస్​వర్డ్ ప్రొటక్షన్ ఉంటుంది. కనుక దీనిని ఓపెన్ చేయాలంటే, మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలను క్యాపిటల్ లెటర్స్​లో నమోదు చేయాలి. అలాగే మీరు పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్​ చేయాలి. అప్పుడే మీ ఆధార్​ కార్డు వివరాలు కనిపిస్తాయి.

నోట్​ : మీరు కావాలనుకుంటే, వర్చువల్ ఆధార్ కార్డును కూడా డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

విదేశాల్లోనూ గూగుల్​ పే సేవలు- తగ్గనున్న ఛార్జీల భారం

స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్​-7 టిప్స్​ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.