ETV Bharat / business

విదేశాల్లోనూ గూగుల్​ పే సేవలు- తగ్గనున్న ఛార్జీల భారం

author img

By PTI

Published : Jan 17, 2024, 8:07 PM IST

Updated : Jan 17, 2024, 8:20 PM IST

Google Pay Services Expansion To Other Countries : ఇకపై విదేశాల్లోనూ గూగుల్​ పే సేవల్ని అందించేందుకు సిద్ధమైంది ప్రముఖ ఆన్​లైన్​​ చెల్లింపుల సేవల సంస్థ గూగుల్​. ఈ మేరకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Google Pay Services Expansion To Other Countries
Google Pay NPCI

Google Pay Services Expansion To Other Countries : భారత్​లో విశేష జనాదరణ పొందిన ప్రముఖ ఆన్​లైన్​​ చెల్లింపు సేవల సంస్థ గూగుల్​ పే తన సేవలను విదేశాల్లోనూ విస్తరించేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు(ఎన్​పీసీఐ) చెందిన ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌ వెలుపలా యూపీఐ సేవల్ని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్​ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సౌలభ్యంతో ఇతర దేశాల్లోను సులువుగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చని చెప్పింది. ఇక ఈ తాజా నిర్ణయంతో విదేశాలకు వెళ్లే వారికి నగదు తీసుకెళ్లటం, ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఛార్జీల భారం తగ్గనుంది.

గూగుల్​-ఎన్​పీసీఐ మధ్య కుదిరిన ఒప్పందంలోని మూడు కీలకాంశాలు ఇవే

  • ఎలాంటి ఇబ్బందీ లేకుండా భారత్ వెలుపలా సులువుగా లావాదేవీలు నిర్వహించటం.
  • ఇతర దేశాల్లో యూపీఐ లాంటి డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థను ఏర్పాటుచేయడంలో సాయపడటం.
  • మూడోది వివిధ దేశాల మధ్య చెల్లింపుల ప్రక్రియ సులభతరం చేయడం.

"డిజిటల్‌ చెల్లింపులు చేయడానికి ఇకపై విదేశీ కరెన్సీ, ఫారెక్స్ కార్డులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. గూగుల్‌పే ద్వారా భారత్‌ వెలుపలా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఈ అవగాహన ఒప్పందం యూపీఐ ఉనికిని మరింత పటిష్ఠం చేస్తుందనే నమ్మకం మాకుంది."
- రితేశ్​ శుక్లా, ఎన్‌పీసీఎల్‌ సీఈఓ

ప్రవాసులకు యూపీఐ
ఇతర దేశాలతో పోలిస్తే ప్రవాస భారతీయులు మన దేశానికి పంపే నగదు శాతం వాటా అధికం. అయితే ఇలా తమ కుటుంబాలకు, స్నేహితులకు డబ్బులు పంపే సమయంలో కొంతమేర దళారులు ఛార్జీల రూపంలో దండుకుంటున్నారు. దీంతో ఎంతో కష్టపడిన సొమ్మును క్షణాల్లో ఇతరుల చేతుల్లోకి మల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యను తగ్గించేందుకే ఆన్​లైన్​ చెల్లింపుల సంస్థ ఎన్​పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల్లోని భారతీయులు సైతం యూపీఐ వ్యవస్థ ద్వారా స్వదేశంలోని తమ వారికి సులువుగా డబ్బులు పంపుకునేందుకు వీలును కల్పించింది. దీనిద్వారా ఇతర దేశాల్లో ఉంటున్న మన ఉద్యోగులు, కార్మికులు, వృత్తి నిపుణులకు అధిక మొత్తంలో డబ్బు ఆదా కానుంది. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

గూగుల్​ పే షాక్​! మొబైల్​ రీచార్జ్​ చేస్తే ఎక్స్​ట్రా కట్టాల్సిందే!

మరో అదిరిపోయే ఫీచర్​- ఇక మరింత ఈజీగా గూగుల్​పేలో చెల్లింపులు!

Last Updated : Jan 17, 2024, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.