ETV Bharat / business

కరోనా భయాలతో భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

author img

By

Published : Feb 24, 2020, 9:52 AM IST

Updated : Mar 2, 2020, 9:15 AM IST

కరోనా వైరస్​పై అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 415 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 12వేల దిగువకు పడిపోయింది.

STOCK MARKETS OPEN NEGATIVE AMIDST CORONA FEAR
కరోనా భయం.. భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

ప్రపంచ దేశాలను కరోనా వైరస్​ గడగడలాడిస్తున్నతరుణంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

415 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​.. 40వేల 754 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయి 11వేల 951 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి...

ఇన్ఫోసిస్​, టెక్​మహీంద్రా, టీసీఎస్​, హెయూఎల్​, సన్​ఫార్మా సంస్థల షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టాటా స్టీల్, వేదాంతా, టాటా మోటార్స్​, ​ఏషియన్​ పెయింట్స్​, కొటక్​ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, బజాజ్​ఫైనాన్స్​, భారతీ ఎయిర్​టెల్​ సంస్థల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ముడిచమురు...

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 2.52 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 56.48 డాలర్లుగా ఉంది.

రూపాయి...

రూపాయి విలువ 19పైసలు తగ్గి, ఒక డాలరుకు రూ.71.83గా ఉంది.

Last Updated : Mar 2, 2020, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.