ETV Bharat / business

మార్కెట్లపై బేర్​ పంజా- సెన్సెక్స్​ 678 పాయింట్లు డౌన్

author img

By

Published : Oct 29, 2021, 3:41 PM IST

Updated : Oct 29, 2021, 4:59 PM IST

stocks markets
స్టాక్ మార్కెట్లు

వారాంతంలో స్టాక్ మార్కెట్లు(Stock Market) నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 678 పాయింట్లు, నిఫ్టీ(Nifty today) 186 పాయింట్ల మేర పతనమయ్యాయి.

అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు(Stock Market) చివరకు నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​(Sensex Today) 678 పాయింట్లు కోల్పోయి.. 59,307 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ(Nifty today) 186 పాయింట్ల నష్టంతో 17,672 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​(Stock Market today) ఉదయం 59,857 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో క్రమంగా కుప్పకూలింది. ఒక దశలో 59,089 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అయితే ఐటీ, ఫార్మా, లోహ, స్థిరాస్థి రంగాల షేర్ల కోనుగోలుతో కోలుకుంది. రోజులో 1,044 పాయింట్లు కదలాడిన సూచీ.. మరో దశలో 60,133 పాయింట్ల గరిష్ఠానికి చేరింది.

మరో సూచీ ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ ఫ్లాట్​గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో..17,613 కనిష్ఠాన్ని తాకింది. ఓ దశలో 17,915 పాయింట్ల గరిష్ఠానికి చేరింది.

లాభనష్టాలోనివి ఇవే..

అట్రాటెక్​సిమెంట్​ 2.61 శాతం, డాక్టర్​రెడ్డీస్​ 2.12శాతం, మారుతీ 1.49శాతం, టాటాస్టీల్​ 1.34 శాతం, టైటాన్​ 0.66శాతం, ఐసీఐసీఐ 0.46 శాతం లాభాలు గడించాయి.

టెక్​ మహీంద్రా 3.53శాతం, ఎన్​టీపీసీ 3.05 శాతం, ఇండస్​బ్యాంకు 2.62శాతం, కొటక్ బ్యాంకు 2.53 శాతం, రిలయన్స్​ 2.24 శాతం ఎల్​ అండ్​ టీ 2.11 శాతం అత్యధికంగా నష్టపోయాయి.

సూచీల పతనానికి కారణాలివే..

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీల ఫలితాలు మదుపర్లను అంతగా మెప్పించలేకపోయాయి. పైగా చమురు ధరలు పెరుగుతుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాలు అలముకుంటున్నాయి. కొన్ని దేశాల్లో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. మరోవైపు వచ్చే వారం వెలువడనున్న యూఎస్‌, ఇంగ్లండ్‌ ఫెడ్‌ నిర్ణయాలపైనా మదుపర్లు దృష్టి సారించారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు ప్రకటించిన ఉద్దీపన పథకాలను ఉపసంహరించుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు భారీ ఎత్తున అమ్మకాలకు దిగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అధిక ధరల వద్ద ట్రేడవుతున్న భారత స్టాక్‌లు ఒక్కసారిగా కిందకు దిగజారుతూ వస్తున్నాయి.

ఇదీ చూడండి: ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్తున్నారా..? ఈ పని చేయాల్సిందే..

Last Updated :Oct 29, 2021, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.