ETV Bharat / business

ఆర్థిక షేర్ల దూకుడు- 50వేల ఎగువకు సెన్సెక్స్​

author img

By

Published : Feb 24, 2021, 5:08 PM IST

వరుస నష్టాలను చవి చూసిన స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1,030 పాయింట్లు పెరిగి 50,781 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 281 పాయింట్లు పుంజుకుని 14,988 కు చేరుకుంది. ఆర్థిక షేర్లు రాణించాయి.

Stock markets closed in positively
లాభాలతో ముగిసిన సూచీలు -50 వేల ఎగువకు సెన్సెక్స్​

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 1,030 పాయింట్లు బలపడి 50,781 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 281 పాయింట్ల లాభంతో 14,988 వద్ద ముగిసింది. ప్రధానంగా బ్యాంక్, అన్ని పెద్ద కంపెనీల షేర్లు లాభాలను గడించాయి.

సాంకేతిక కారణాల వల్ల నిఫ్టీలో ఉదయం 11:40 గంటల నుంచి ట్రేడింగ్‌ నిలిపివేశారు. సమస్య పరిష్కారం అయ్యాక సాయంత్రం 3:45 గంటల నుంచి ట్రేడింగ్‌ పునఃప్రారంభించారు. నిఫ్టీతో పాటు సెన్సెక్స్‌ సమయాన్ని సైతం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,881 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,649 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,008 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,723 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభ నష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​, టెక్​ మహేంద్ర , ఎస్​బీఐ, టాటాన్​ షేర్లు లాభాలను గడించాయి.

రెడ్డీస్​, టీసీఎస్​, సన్​ఫార్మా, మారుతి, పవర్ గ్రిడ్​,షేర్లు నష్టపోయాయి.

ఇదీ చూడండి: బిట్​కాయిన్​లో ట్విట్టర్​ బాస్​ భారీ పెట్టుబడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.