ETV Bharat / business

మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లోనే సూచీలు..

author img

By

Published : Jul 1, 2021, 9:36 AM IST

Updated : Jul 1, 2021, 12:30 PM IST

STOCKS LIVE
లాభాల్లో సూచీలు

12:14 July 01

ఒడుదొడుకుల ట్రేడింగ్​.. నష్టాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 82 పాయింట్లకు పైగా కోల్పోయి 52,400 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 22 పాయింట్లు కోల్పోయి 15,700 వద్ద కొనసాగుతోంది.

హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  •  బజాజ్​ ఆటో, ఎస్​బీఐ, మారుతీ, సన్​ఫార్మా లాభాల్లో ఉన్నాయి.
  • రిలయన్స్, ఎల్​ అండ్​ టీ, అల్ట్రాటెక్, హెచ్​డీఎఫ్​సీ, ఇన్ఫోసిస్, పవర్​గ్రిడ్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:08 July 01

నష్టాల్లో సూచీలు

అంతర్జాతీయ బలహీనతల నేపథ్యంలో.. దేశీయ స్టాక్​ మార్కెట్లు గురువారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 32 పాయింట్ల నష్టంతో 52,451 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 5 పాయింట్లు కోల్పోయి 15,717 వద్ద కొనసాగుతోంది.

ఐటీ​ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటుండగా.. ఫార్మా షేర్లు రాణిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ ఒక మేర శాతం నష్టపోయింది.

మూలధన మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌ఐఐలు) గణనీయ అమ్మకాలు సాగిస్తున్నందున మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు.

  • ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో ఉన్నాయి.
  • బజాజ్ ఆటో, ఎంఅండ్​ఎం, ఏషియన్ పెయింట్స్, మారుతి, టైటాన్, కోటక్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్ లాభాల్లో ఉన్నాయి.

ఆసియాలోని ఇతర మార్కెట్లయిన.. షాంఘై, సియోల్, టోక్యో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Jul 1, 2021, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.