ETV Bharat / business

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు- నిఫ్టీ@17,946

author img

By

Published : Oct 11, 2021, 9:30 AM IST

Updated : Oct 11, 2021, 3:47 PM IST

Indices open lower amid mixed global cues; RIL, TCS in focus
స్టాక్ మార్కెట్

15:44 October 11

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలను గడించాయి. సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 60,136 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 17,946 వద్దకు చేరింది.

  • మారుతీ సుజుకీ, పవర్​గ్రిడ్​, ఐటీసీ, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • టీసీఎస్​, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​టెక్​, ఎల్​&టీ ఎక్కువగా నష్టపోయాయి.

11:56 October 11

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 260 పాయింట్లకుపైగా పెరిగి 60,324 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లకుపైగా లాభంతో 18,000 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది . నిఫ్టీ 18 వేల మార్క్ దాటడం ఇదే తొలిసారి.

బ్యాంకింగ్, ఆటో షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఐటీ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

  • మారుతీ సుజుకీ, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, కోటక్ మహీంద్రా, ఎం&ఎం ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • టీసీఎస్​ 5 శాతానికిపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఇటీవల ప్రకటించిన 2021-22 క్యూ2 ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల సంస్థ షేర్లు ఈ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
  • టెక్​ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​టెక్​, ఇన్ఫోసిస్​, ఎల్&టీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:02 October 11

అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ప్రస్తుతం లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు వృద్ధి చెంది 60,262 పాయింట్ల వద్ద కదలాడుతోంది. 

మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ.. నిఫ్టీ సైతం లాభాల్లో పయనిస్తోంది. 74 పాయింట్లు ఎగబాకి.. 17,965 వద్ద ట్రేడవుతోంది. 

09:08 October 11

STOCKS LIVE UPDATES

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​ను (Stock Market today) నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితులతో డీలా పడ్డ సూచీలు.. ప్రస్తుతం ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

బీఎస్​ఈ సెన్సెక్స్ (Stock Market Sensex) ఓ దశలో 115 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం స్వల్ప నష్టంతో 60,050 పాయింట్ల వద్ద కదలాడుతోంది.

మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ (Stock Market Nifty) 3 పాయింట్ల నష్టంతో 17,892 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివివే...

సెన్సెక్స్ షేర్లలో టీసీఎస్ భారీగా పతనమైంది. 6 శాతానికి పైగా నష్టపోయింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్​సీఎల్ టెక్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. పవర్ గ్రిడ్, మారుతీ, కోటక్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.

Last Updated : Oct 11, 2021, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.