ETV Bharat / business

మార్కెట్లకు నష్టాలు- సెన్సెక్స్ 314 పాయింట్లు డౌన్

author img

By

Published : Nov 17, 2021, 3:37 PM IST

స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్​ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్​ (Sensex today) 314 పాయింట్లు కోల్పోయి 60,008 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 101 పాయింట్లు దిగజారింది.

stock market
స్టాక్​మార్కెట్​

స్టాక్​ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​(Sensex today) 314 పాయింట్లు కోల్పోయి 60,008 వద్ద సెషన్​ను ముగించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ(Nifty today) 101 పాయింట్ల నష్టంతో 17,898 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు.. దేశీయంగా ఎలాంటి సానుకూల పరిణామాలు లేకపోవడం వల్ల స్టాక్​మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఒక దశలో పుంజుకున్నట్లు కనిపించినా.. చివరకు నష్టాలను నమోదు చేశాయి.

ఆటోమొబైల్​, విద్యుత్​ రంగాలు లాభాలను నమోదు చేశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

60,179 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​ 60,426 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. అయితే నష్టాలు కొనసాగడం వల్ల ఒకానొక దశలో 60,029 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది.

నిఫ్టీ 17,939 వద్ద ప్రారంభమై.. 17,906 వద్ద కనిష్ఠాన్ని తాకింది. వెంటనే పుంజుకుని 18,022 గరిష్ఠాన్ని అందుకుంది.

ఆటోమొబైల్​, బ్యాంకింగ్, ఫార్మా​ రంగాలు మార్కెట్​ నష్టాలపై ప్రభావం చూపించాయి.

లాభనష్టాలు..

  • మారుతీ, ఏషియన్​ పెయింట్స్​, పవర్​గ్రిడ్​, ఐటీసీ, ఎన్​టీపీసీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, టెక్​ మహీంద్ర షేర్లు లాభాలను గడించాయి.
  • యాక్సిస్​ బ్యాంక్, రిలయన్స్​, కోటక్​ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టైటాన్​ షేర్లు నష్టాలను చవిచూశాయి.

ఇదీ చూడండి: 72 విమానాలు కొంటున్న ఝున్​ఝున్​వాలా.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.