ETV Bharat / business

లాభాల స్వీకరణతో ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు

author img

By

Published : Aug 11, 2021, 3:51 PM IST

స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు తగ్గింది. సెన్సెక్స్ (Sensex today) 29 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ (Nifty today) 16,282 వద్ద ఫ్లాట్​గా ముగిసింది. బ్యాంకింగ్, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను ఒడుదొడుకులకు గురి చేసింది.

stocks close with losses
స్టాక్ మార్కెట్లకు నష్టాలు

స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు బుధవారం అడ్డుకట్ట పడింది. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) అతి స్వల్పంగా 29 పాయింట్లు తగ్గి 54,525 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 2 పాయింట్ల లాభంతో 16,282 వద్ద ఫ్లాట్​గా ముగిసింది.

ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం వల్ల సెషన్​ మొత్తం ఒడొదడుకులు ఎదుర్కొన్నాయి సూచీలు. చివర్లో కొనుగోళ్లు నమోదవటం కారణంగా తిరిగి దాదాపు ఫ్లాట్​గా ముగిశాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 54,758 పాయింట్ల అత్యధిక స్థాయి, 54,167 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 16,338 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,162 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​, బజాజ్ ఫిన్​సర్వ్​ లాభాలను గడించాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, సన్​ఫార్మా, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్కువగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు లాభాలతో ముగిశాయి. కోస్పీ (దక్షిణ కొరియా) మాత్రం నష్టాలను నమోదు చేసింది.

ఇదీ చదవండి: 2020-21 వడ్డీ చెల్లింపుపై ఈపీఎఫ్​ఓ క్లారిటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.