ETV Bharat / business

Stock Market: ఒడుదొడుకుల్లో దేశీయ మార్కెట్​ సూచీలు

author img

By

Published : Dec 15, 2021, 9:30 AM IST

Updated : Dec 15, 2021, 2:46 PM IST

Market LIVE Updates
Stock Market

14:44 December 15

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఓ దశలో 400 పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్​ కోలుకుంది. ప్రస్తుతం 50 పాయింట్ల నష్టంతో 58 వేల 60 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 17 వేల 300 వద్ద ఉంది.

12:14 December 15

ఒడుదొడుకుల ట్రేడింగ్​..

స్టాక్​ మార్కెట్​ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 250 పాయింట్లకుపైగా కోల్పోయింది. ప్రస్తుతం 57 వేల 860 ఎగువన కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో.. 17 వేల 250 దిగువన ఉంది.

ఐటీ, రియాల్టీ, ఫార్మా సూచీలు ఎక్కువగా నష్టపోయాయి. బీఎస్​ఈ మిడ్​, స్మాల్​ క్యాప్​ సూచీలు ఫ్లాట్​గా ట్రేడింగ్​ సాగిస్తున్నాయి.

లాభనష్టాల్లో..

కోటక్​ మహీంద్రా, యాక్సిస్​ బ్యాంక్​, యూపీఎల్​, ఎం అండ్​ ఎం, ఎల్​ అండ్​ టీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బజాజ్​ ఫినాన్స్​, అదానీ పోర్ట్స్​, దివీస్​ ల్యాబ్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, టీసీఎస్​ డీలాపడిపోయాయి.

09:19 December 15

Stock Market: నష్టాల్లో మార్కెట్లు- 58 వేల దిగువకు సెన్సెక్స్​

Stock Market: అంతర్జాతీయంగా మిశ్రమ పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 155 పాయింట్లు కోల్పోయి 57 వేల 960 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 17 వేల 300 దిగువన ఉంది.

లాభనష్టాల్లో..

ఎం అండ్​ ఎం, ఐటీసీ, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, యాక్సిస్​ బ్యాంక్​, సిప్లా రాణిస్తున్నాయి.

దివీస్​ ల్యాబ్స్​, బజాజ్​ ఫినాన్స్​, శ్రీ సిమెంట్స్​, డా. రెడ్డీస్​ ల్యాబ్స్​, ఓఎన్​జీసీ డీలాపడ్డాయి.

Last Updated :Dec 15, 2021, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.